టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

తిరుమలలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పాలక మండలి సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో భాగంగా పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

 Key Decisions In Ttd Governing Body Meeting-TeluguStop.com

టీటీడీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కమిటీ ఏర్పాటు చేయనుంది.

రూ.18 కోట్లతో టీటీడీ పురాతన గోడౌన్లు పునర్ నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది.కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేసింది.టీటీడీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టడంతో పాటు తాతయ్యగుంట గంగమ్మ ఆలయం అభివృద్ధికి రూ.3.12 కోట్లతో టెండర్లు పిలవనుంది.అదేవిధంగా మే 3వ తేదీ నుంచి ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.దాంతో పాటు మే నెలాఖరుకు తిరుపతిలో శ్రీనివాస సేతు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.అయితే ఇప్పటివరకు శ్రీనివాస సేతుకు రూ.287 కోట్లు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube