కర్నాటకలో( Karnataka Elections) రాజకీయలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకు ఎంతో సమయం లేనందున ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
అయితే కర్నాటకలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికి పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మద్యనే అని చెప్పవచ్చు. జేడీఎస్ పార్టీ కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికి ప్రధాన పోరు మాత్రం ఆ రెండు పార్టీల మద్యనే.
అయితే ఈ రెండు పార్టీలకు మరో రెండు పార్టీలతో ముప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆ రెండు పార్టీలు ఏవనగా ఒకటి కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ), మరోటి శరత్ పవర్( Sharad Pawar ) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.

ప్రస్తుతం ఈ రెండు పార్టీలు కూడా కర్నాటక ఎలక్షన్స్ పై గట్టిగానే దృష్టి పెట్టాయి.డిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, గోవా ఎన్నికల్లో సత్తా చాటి జాతీయ పార్టీగా అవతరించింది.జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తరువాత మొదటి సారి అధికారిక జాతీయ పార్టీ హోదాలో అప్ కర్నాటక ఎలక్షన్స్ లో అడుగుపెట్టబోతుంది.ఇప్పటికే ఆ పార్టీ నేతలు కన్నడనాట చురుకుగా వ్యూహాలు రచిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రభావం చూపే కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరువాత స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్నడ నాట కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీ( BJP ), వ్యతిరేక ఓటును ఆప్ చీల్చే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మొన్నటివరకు విపక్షాల ఐక్యత పేరుతో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్న ఎన్ సి పి ( NCP ), అనూహ్యంగా కాంగ్రెస్ కు ఝలక్ ఇస్తూ కర్నాటక ఎలక్షన్స్ లో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది.దాదాపుగా 40 నుంచి 45 స్థానాలలో పోటీ చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ పార్టీ యొక్క ప్రభావం కాంగ్రెస్ పై అధికంగా పడే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.ఇక ఇవే కాకుండా ఏంఐఏం, బిఆర్‌ఎస్ వంటి పార్టీలు కూడా కర్నాటక ఎలక్షన్స్ లో బరిలోకి దిగుతున్నాయి.మరి ఈ ఆసక్తికరమైన పోరులో కన్నడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.







