ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలేవీ ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదు.ఏప్రిల్ తొలి వారం విడుదలైన రావణాసుర, ఈ వారం విడుదలైన శాకుంతలం సినిమాలు అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.
ఏప్రిల్ మూడో వారంలో విరూపాక్ష మూవీ( Virupaksha movie ) రిలీజ్ కానుండగా సాయితేజ్( Sai Tej ) నటించిన ఈ సినిమాపై పరవాలేదనే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR)వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు సైతం ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయితేజ్ జబర్దస్త్ షో( Jabardasth Show )కు గెస్ట్ గా హాజరు కాగా తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.ప్రోమోలో సాయితేజ్ యాంకర్ సౌమ్యారావుపై పంచ్ లు వేయగా ఆ పంచ్ లు ప్రోమోకు హైలెట్ గా నిలవడం గమనార్హం.

సాయితేజ్ “ఏంజిల్స్ రావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా” అని చెప్పగా సౌమ్య వెంటనే అయ్యో రామ అని కామెంట్ చేయగా “మిమ్మల్ని కాదులేండి” అంటూ సాయితేజ్ రివర్స్ లో షాకిచ్చారు. సౌమ్యారావు గాలి తీసేలా అదిరిపోయే డైలాగ్స్ తో సాయితేజ్ నవ్వుల పువ్వులు పూయించారు.కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో రావడం మాత్రం పక్కా అంటూ సాయితేజ్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి అదుర్స్ అనిపించారు.

సాయిధరమ్ తేజ్ ను ధర్మరాజు సార్ అంటూ సౌమ్య ఆట పట్టించారు.ఈ నెల 20వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.సాయితేజ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సాయితేజ్ విరూపాక్ష సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







