అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త, సిక్కు కమ్యూనిటీ( Sikh community ) నాయకురాలు రాజీ బ్రార్‌కు కీలక పదవి దక్కింది.కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు (సీఎస్‌యూబీ) ఆమె నియమితులయ్యారు.
ఇది అమెరికా ప్రభుత్వరంగంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో శక్తివంతమైన నాయకత్వ పదవి.కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (సీఎస్‌యూ) బేకర్స్ ఫీల్డ్.
పూర్వ విద్యార్ధి అయిన రాజీ బ్రార్ వచ్చే నెలలో లాంగ్ బీచ్‌లో జరిగే సమావేశం ద్వారా బోర్డులోకి అడుగుపెడతారు.

రాజీ బ్రార్.2003 నుంచి కంట్రీసైడ్ కార్పోరేషన్ యజమానిగా, చీఫ్ ఆఫరేషన్స్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.కెర్న్ కౌంటీకి చెందిన పలు సంస్థల్లో ఆమె నాయకత్వ హోదాలో వున్నారు.
బేకర్స్‌ఫీల్డ్ సిక్కు ఉమెన్స్ అసోసియేషన్ ( Bakersfield Sikh Women’s Association )సహ వ్యవస్థాపకురాలిగానూ వున్నారు.సీఎస్‌యూబీ నుంచి జీవశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, ఆరోగ్య సంరక్షణలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డగ్రీని రాజీ బ్రార్ పొందారు.
అంతేకాదు.సీఎస్‌యూబీ అలుమ్ని హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ ఆమె సభ్యురాలు.

రాజీ బ్రార్( Raji Brar ) కుటుంబం 1970ల ప్రాంతంలో పంజాబ్ నుంచి అమెరికాకు వలస వచ్చింది.సెంట్రల్ వ్యాలీ వ్యవసాయ కార్మిక శిబిరాల్లో వీరి కుటుంబం నివసించింది.రాజీ బ్రార్ తల్లి ఐదవ తరగతి వరకు చదువుకున్నారు.ఇంటికి దగ్గరగా వుండటం, అందుబాటులో ఫీజులు వుండటంతో రాజీ బ్రార్ సీఎస్‌యూబీలో చదువుకున్నారు.2007లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి సిక్కు మహిళగా రాజీ బ్రార్ చరిత్ర సృష్టించారు.అర్విన్ సిటీ కౌన్సిల్‌కి జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ ఆమెను ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.
కమ్యూనిటీ లీడర్‌గా అనేక బోర్డు, కమిటీలలో పనిచేసిన రాజీ బ్రార్‌ను ఎన్నో అవార్డులు వరించాయి.బేకర్స్ ఫీల్డ్ సిక్కు మహిళా సంఘం తరపున యువతీ, యువకులకు స్కాలర్‌షిప్ అందించే కార్యక్రమం వెనుక రాజీ బ్రార్ ఎంతో కృషి చేశారు.







