కేంద్రంపై అసెంబ్లీలో విమర్శలు చేయడం కాదు.పార్లమెంట్ లో మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
కేంద్రం ఇచ్చే నిధులపై అసెంబ్లీలో మాట్లాడటం కాదు.పార్లమెంట్ లో ప్రశ్నించాలన్నారు.
సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఎన్ని నిధులు ఇస్తున్నారో ముందు చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.నీతి అయోగ్ కేవలం రికమండేషన్ చేసే ఏజెన్సీ మాత్రమేనన్నారు.
ధరణిలో అవకతవకలను పరిష్కరించాలని ముగ్గురు మంత్రుల కమిటీ రికమండేషన్స్ ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు.తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎక్కడ బాగుందో చూపెట్టాలన్నారు.
డబ్బులు సంచులు దొరికాయని పోలీసులతో తప్పులు చెప్పించారని.ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో ఎంక్వైరీ చేస్తే నష్టమేంటని నిలదీశారు.
సుప్రీంకోర్టుకు కాకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి సైతం వెళ్లండని పేర్కొన్నారు.ఇక్కడ ఎలాంటి తీర్పు వచ్చిందో అక్కడ కూడా అదే వస్తుందని తెలిపారు.