భార్యను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఎన్ఆర్ఐ రాకేశ్ పటేల్ శవమై తేలాడు.కెనడాలోని టోరంటోలోని తన ఫ్లాట్‌లో అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతని భార్య హీరల్ పటేల్ గత వారం కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది.ఈ కేసులో రాకేశ్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
జనవరి 11న అదృశ్యమైన హీరల్ బ్రాంప్టన్‌కు సమీపంలోని అడవుల్లో శవమై కనిపించారు.
కేసు దర్యాప్తులో భాగంగా హీరల్ భర్త రాకేశ్‌పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతనిపై దేశవ్యాప్త అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
కాగా గత శుక్రవారం టొరంటోలోని ఎటోబికోక్ ప్రాంతంలోని ఓ హైడ్రో టవర్ సమీపంలో రాకేశ్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా బయటకు రానప్పటికీ.రాకేశ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.2009 హోండా సివిక్ మోడల్ కారు అక్కడికి దగ్గరలోని క్యాసినోకు దగ్గరలో పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలోని బోర్సాద్ తాలుకా పమోల్ గ్రామానికి చెందిన హీరల్.అక్కడికి సమీపంలోని కింక్‌లాడ్ గ్రామానికి చెందిన రాకేశ్ పటేల్‌ను 2013లో వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత కెనడాకు చేరుకున్న ఆమె తన అత్తమామలతో కలిసి అక్కడే స్థిరపడింది.ఇదే సమయంలో హీరల్ సోదరుడు వినయ్ పటేల్‌తో పాటు మరో కజిన్ కూడా కెనడాలోనే స్థిరపడ్డారు.
కొన్నేళ్ల తర్వాత హీరల్ తన భర్త, అత్తామామలతో సంబంధాలు తెంచుకున్నారు.మనస్పర్థలతో ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకు సంబంధించి కొన్ని నెలల క్రితం లాంఛనాలు ప్రారంభమయ్యాయి.హీరల్ మృతదేహంపై గాయాలు ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
రాకేశ్ బంధువు ఒకరు గతంలో హీరల్‌ను చంపుతానని బెదిరించినట్లు వారు పోలీసులకు తెలిపారు.