తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం లేపిన కీసర తహసీల్దారు బాలరాజు నాగరాజు ఒక భూమికి పట్టా ఇవ్వడం కోసం 2 కోట్ల రూపాయిలు లంచంగా తీసుకోవడానికి అంగీకరించారు.అందులో భాగంగా 1.10 కోట్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖా అధికారులకు పట్టుబడ్డారు.బాలరాజు నాగరాజు దగ్గర కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్ దొరికింది.
దీనికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఒకవేళ అతనికి నాకు సంబంధం ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే తాజాగా మరోమారు బాలరాజు నాగరాజు వార్తలలో నిలిచారు దానికి కారణమేంటంటే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండుస్వచ్చంద సంస్థలు ఓ ప్రభుత్వ ఉద్యోగి దాదాపు 20 మిలియన్ డాలర్లు లంచం స్వీకరిస్తూ పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారని కావున ఈ అంశాన్ని గిన్నిస్ రికార్డులలోకి ఎక్కించవల్సిందిగా ఆ రెండుస్వచ్చంద సంస్థల ప్రతినిధులు గిన్నిస్ రికార్డు అధికారులను కోరారు.
తాజాగా దీని పై స్పందించిన గిన్నిస్ రికార్డు అధికారులు ఇప్పటివరకు తమ రికార్డ్స్ లో ఇలాంటి కేటగిరి లేదని దీనికోసం ఆ కేటగిరీని ప్రారంభించే విషయంపై తమ టీంతో కలిసి పరిశీలిస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలియజేశారని జ్వాల సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ప్రశాంత్ తెలిపారు.