అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఆసరా

తెలంగాణలో ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో పంటలను నష్టపోయిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.ఈ మేరకు రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు రూ.151.46 కోట్లు మంజూరు చేసింది.

 Kcr Government Support To Farmers Who Lost Due To Untimely Rains-TeluguStop.com

వచ్చే వారం నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు.ఇందుకు గానూ బాధిత రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.ఈ నేపథ్యంలో పంటలను స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ రైతులను పరామర్శించారు.అనంతరం ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.26 జిల్లాల్లో మొత్తం 1.31 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube