అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఆసరా

తెలంగాణలో ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో పంటలను నష్టపోయిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

ఈ మేరకు రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు రూ.151.

46 కోట్లు మంజూరు చేసింది.వచ్చే వారం నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు.

ఇందుకు గానూ బాధిత రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.

ఈ నేపథ్యంలో పంటలను స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ రైతులను పరామర్శించారు.అనంతరం ఎకరానికి రూ.

10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.26 జిల్లాల్లో మొత్తం 1.

31 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది.

తన రెమ్యునరేషన్ గురించి వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?