కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) విజయకేతనం ఎగరేయడం తెలిసిందే.దీంతో ఈనెల 18వ తారీఖున కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేయడం జరిగింది.
అదే రోజు కర్ణాటక కొత్త క్యాబినెట్ కు కూడా ముహూర్తం ఖరారు అయింది.కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్షాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపించినట్లు సమాచారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ( Sonia, Rahul, Priyanka Gandhi ) హాజరుకానున్నారు.
చాలాకాలం తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికలలో అతిపెద్ద విజయం సాధించడంతో… కాంగ్రెస్ జాతీయ నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు.ఇదే జోరు ఈ ఏడాది మిగతా రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో కూడా కొనసాగించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.దీనిలో భాగంగా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.కర్ణాటక ( Karnataka )అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చాలా దారుణంగా పరాజయం పాలయ్యింది.
మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 135 చాట్ల విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే నూతన సీఎం ఎవరు అనేదాన్ని విషయంలో ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి పదవి రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.