సుదీర్ఘకాలం పాటు భారత దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండవసారి ప్రతిపక్ష స్థాయి సీట్ లను కూడా గెలవలేక చతికిలపడింది.మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ తమ ఓటమికి గల కారణాలు ఏమిటి? తాము ఎందుకు ప్రజల నమ్మకాన్ని సంపాదించలేక పోయాం అనే అంశాలపై సమీక్షలు నిర్వహించుకోకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా ఖండిస్తున్నాం అనే స్టేట్మెంట్ లు ఇవ్వడానికి పరిమితమయింది తప్ప ఇలా చేయండి అంటూ సూచనలు మాత్రం ఇవ్వడానికి ఒక జాతీయస్థాయి పార్టీ ముందుకు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
మొన్నటి వరకు బిజేపి పై వార్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ నాయకుల తోనే వార్ చేస్తుంది.సరిగ్గా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమయ్యే ముందురోజు పార్టీలోని 23 మంది సీనియర్లు నాయకత్వ మార్పుపై పార్టీ ప్రక్షాళన వంటి అంశాలపై సోనియా గాంధీకి లేఖ రాశారు.
దీనిపై రాహుల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీవ్రంగా ఫైర్ అయ్యారు.ఆతర్వాత ఆ పార్టీలో జరిగిన గందరగోళం అందరికీ తెలిసిందే.ఇక తాజాగా నాయకత్వ మార్పుపై సోనియాకి రాసిన లేఖ పై సంతకం చేసిన జతిన్ ప్రసాద్ పై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు.
క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడి కాంగ్రెస్ కమిటీ ఏకంగా తీర్మానం చేసింది.
దీనిపై స్పందించిన కపిల్ సిబల్.యూపీ కాంగ్రెస్ జితిన్ ప్రసాద్ ను టార్గెట్ చేయడం దురదృష్టకరం.
ఇలా సమయం వృథా చేయడం కంటే బిజేపి మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మంచిది”అని ఆయన ట్వీట్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండాల్సిన కాంగ్రెస్ ఇలా కొట్టుకు చస్తుంటే బిజేపి దేశంలో మరింతగా బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నారు.
మరి వారి అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు గౌరవిస్తారా లేదో వేచి చూద్దాం.