లవర్ బోయ్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా కూడా సినిమాలు చేస్తారన్న విషయం తెలిసిందే.శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఆయన సినిమాలు నిర్మిస్తారు.
నితిన్ చేసే సినిమాల్లో కో ప్రొడ్యూసింగ్ కూడా చేస్తుంటారు.అయితే ఇప్పుడు ఓ తమిళ సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నారు శ్రేష్ఠ్ మూవీస్.
లోకనాయకుడు కమల్ హాసన్ లీడ్ రోల్ లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించిన క్రేజీ మూవీ విక్రం.లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సూర్య కూడా కెమియో రోల్ చేసినట్టు తెలుస్తుంది.
సినిమా నుండి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక ఈ సినిమాను తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణా రెండు ప్రాంతాల్లో విక్రం సినిమాను సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ కోసం నితిన్ అండ్ టీం భారీ మొత్తమే వెచ్చించారని తెలుస్తుంది.
కమల్ హాసన్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.విక్రం సినిమా జూన్ 3న రిలీజ్ ఫిక్స్ చేశారు.పోటీగా రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలు వస్తుండగా విక్రం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.