అందాల చందమామగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.ఈమె లక్ష్మీ కళ్యాణం, చందమామ ( Chandamama ) వంటి సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమై మొదటి సినిమాలతోనే మంచి స్టార్డం సంపాదించింది.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది కాజల్.అయితే కాజల్ (Kajal) పెళ్లయ్యాక ఆ హీరోతో డేటింగ్ చేస్తానంటూ స్వయంగా మాట్లాడి ప్రస్తుతం ట్రోల్స్ కి గురైంది.
అయితే పెళ్లయ్యాక ఇదేం పని.కాజల్ ఎందుకు అలా వేరే హీరోతో డేటింగ్ కి వెళ్తాను అని చెప్పింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
కాజల్ అగర్వాల్ పెళ్లయినప్పటికీ కూడా సినిమాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఓవైపు ఫ్యామిలీని మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తుంది.అంతేకాదు బాబు పుట్టాక కనీసం సంవత్సరం కూడా ఇంటి దగ్గర ఉండకుండా షూటింగ్స్ లో పాల్గొంది .అయితే ఓ వేదికపై కాజల్ కి మీరు అవకాశం వస్తే ఏ హీరోతో డేటింగ్ కి వెళ్తారు అనే ప్రశ్న ఎదురైతే.నేను ఛాన్స్ వస్తే అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) తో డేటింగ్ చేస్తాను అంటూ మాట్లాడి ట్రోల్స్ గురైంది.
కానీ అసలు విషయం ఏమిటంటే.కాజల్ అగర్వాల్ ( Kajal agarwal ) స్టేజిపై ఈ మాటలు మాట్లాడింది పెళ్లయ్యాక కాదట.పెళ్లికాకముందే ఓ వేదికపై ఈ ప్రశ్న ఎదురైతే నాగార్జునతో డేటింగ్ చేస్తాను అని చెప్పింది.కానీ అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలియని కొంతమంది పెళ్లయ్యాక కూడా కాజల్ నాగార్జునతో డేటింగ్ చేయాలి అనుకుంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
కానీ ఈ వీడియో ఇప్పటిది కాదు పెళ్లి కాకముందుదట.అలాగే నాగార్జునతో ది గోస్ట్( The Ghost ) సినిమాలో నటించే అవకాశం కాజల్ కి వచ్చినప్పటికీ అప్పుడు తాను ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఆ ఛాన్స్ మిస్ అయిందట.
అయితే నాగార్జున నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాలే అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.