ఆగస్టు 15, 1947 లో మనకు స్వాత్రంత్ర సిద్ధించింది.అప్పటి నుంచి మనం ప్రతి ఏడాది ఆగస్టు 15 రోజున స్వాత్రంత్ర దినోత్సవ(Independance day) వేడుకలను చాలా అట్టహాసంగా నిర్వహించుకుంటున్నాం.
అయితే స్వాత్రంత్ర దినోత్సవం వెనుక ఎంతో చరిత్ర ఉంది.దాని వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగం ఉంది.వాళ్ల త్యాగాలను కొనియాడుతూ ఆగస్టు 15 రోజున తప్పనిసరిగా జాతీయ జెండాను( National Flag ) ఎగరవేసి వారి త్యాగనిరతికి ప్రతీకగా గీతాలాపన చేసి జాతీయ జెండాను ఎగరవేస్తాం.ఈ జెండా పండగ అనేది దేశవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా సబ్బండ వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు.
అలాంటి జాతీయ జెండాను ఎగరవేసే సమయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలట.ఆ నియమాలు ఏంటో చూద్దాం.
ఆగస్టు 15వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.ఆ తర్వాత ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్లు, అధికారులు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తారు.మరి అలాంటి జాతీయ జెండా ఎగరవేసే సమయంలో చాలా నియమాలు ఉంటాయట.ఆ నియమాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు అంటున్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం.
1.ప్లాస్టిక్ జెండాలు( Plastic Flags ) అస్సలు వాడకూడదు.2.అంతేకాకుండా జెండాలో పైనుంచి కిందికి కాషాయ, తెలుగు ఆకుపచ్చ,రంగులు సమానమైనటువంటి స్థాయిలో ఉండాలి.3.అంతేకాకుండా త్రివర్ణ పతాకం మధ్య భాగంలో అశోక ధర్మచక్రం( Ashoka Wheel ) 24 ఆకులు నీలం రంగులో తప్పనిసరిగా ఉండాలి.4.ఎత్తడం,దించడం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరిగిపోవాలి.5.జెండాను నేలపై కానీ నీటిమీద కానీ వేసి అస్సలు తొక్కరాదు.6.ఇక జెండాను ఎత్తే సమయంలో చాలా స్పీడ్ గా ఎత్తి దించే సమయంలో నెమ్మదిగా దింపాలి.7.జాతీయ జెండాను ఏవైనా ఇతర జెండాలతో కలిపి ఎగరవేయాల్సి వస్తే వాటన్నింటికంటే కాస్త ఎత్తులో జాతీయ జెండా ఉండాలి.8.జెండా ఎప్పుడూ కూడా నిటారు గానే ఉండాలి.కానీ క్రిందికి అస్సలు వంచకూడదు.