సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సినీ నటి కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) ఒకరు.లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయం అయినటువంటి ఈమె అనంతరం తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.
ఇలా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు.ఇకపోతే ఇటీవల కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు.
పెళ్లి తర్వాత ఈమె ఒక బాబుకు జన్మనిచ్చిన అనంతరం తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.త్వరలోనే కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ ( Satyabhama ) అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ సినిమాలలో నటించారు.తప్ప ఐటమ్ సాంగ్స్ చేయలేదు.కానీ మొదటిసారి ఎన్టీఆర్( Ntr ) సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్ చేశారు.
ఈ విషయం గురించి ఆలీ ప్రశ్నించారు.డైరెక్టర్ కోసం చేశారా లేక నిర్మాత కోసం చేశారా అనే ప్రశ్న ఎదురవడంతో కాజల్ అగర్వాల్ హీరో ఎన్టీఆర్ కోసం చేశానని తెలిపారు.
తాను ఎప్పుడూ కూడా ఇలా స్పెషల్ సాంగ్ చేయలేదు కానీ ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకొని జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశానని తెలిపారు.ఎన్టీఆర్ తో ఉన్నటువంటి మంచి ఫ్రెండ్షిప్ తోనే ఆయన కోసం చేశానని తెలిపారు.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో బాద్షా, టెంపర్, బృందావనం అంటే సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.