అమెరికాకు భారీ సంఖ్యలో తెలుగు విద్యార్ధులు...మరో గుడ్ న్యూస్ ఏంటంటే..

అందుగలడు, ఇందు గలడు అనే సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అంటూ శ్రీ హరిని తలుచుకున్నట్లుగా, ప్రపంచ నలు మూలలలో ఎక్కడ వెతికినా మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు.ఎలాంటి వ్యవస్థలో కైనా చొచ్చుకుపోగల సత్తా, సామర్ధ్యం, తెలివి తేటలు తెలుగువారి సొంతం.

 America Consul General Joel Reifman Education Usa Undergraduate Virtual Fair,edu-TeluguStop.com

ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో తెలుగు వారి హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.విద్యా , వైద్య, వ్యాపార, రాజకీయ రంగంలో మనవారి హవా ఇప్పటికి ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది.

ఇదిలాఉంటే


అమెరికా కాన్సులేట్ జనరల్ జోయాల్ రీఫ్మన్ మాట్లాడుతూ అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి చూపుతూ భారత్ నుంచీ అమెరికా వెళ్ళే విద్యార్ధులలో అత్యధిక శాతం తెలుగు వారే ఉంటున్నారని ఆయన అన్నారు.అమెరికాలో ఉన్నత చదువు చదువుకోవాలని ఆశపడే వారికోసం ఆగస్టు 27 న గ్రాడ్యుయేషన్ ఫెయిర్ ను వర్చువల్ గా నిర్వహించింది.

ఈ ఫెయిర్ కోసం దేశ వ్యాప్తంగా దాదాపు 6వేల మంది పాల్గొన్నారు.అయితే ఈ 6వేల మందిలో దాదాపు 1970 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని జోయాల్ రీఫ్మన్ ప్రకటించారు.

అంతేకాదు గడిచిన ఏడాదితో పోల్చితే ఇది దాదాపు 44 శాతం అధికమని, ముఖ్యంగా హైదరాబాద్ నుంచీ విద్యార్ధులు అత్యదికంగా ఎంపిక అయ్యారని ఆయన ప్రకటించారు.అయితే

Telugu Americaconsul, Indian America, Telugu-Telugu NRI

ఆగస్టు 27 న జరిగిన ఈ ఫెయిర్ లో దాదాపు 100 కు పైగా విద్యా సంస్థలు పాల్గొన్నాయని విద్యార్ధులు తమ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని తెలిపారు.ఇదిలాఉంటే అమెరికాలో అత్యధికంగా భారత దేశం నుంచీ విద్యార్ధులు వచ్చి చదువుకుంటున్నారని, అమెరికాలోని విదేశీ విద్యార్ధులలో దాదాపు 20 శాతం మంది భారతీయ విద్యార్ధులే ఉన్నారని ప్రకటించారు.అమెరికాలో చదువుకోవాలని ఆశక్తి చూపే విద్యార్ధులకు అమెరికా ప్రభుత్వం ఎప్పడు సహకరిస్తుందని తెలిపారు జోయాల్ రీఫ్మన్.

అంతేకాదు సెప్టెంబర్ 3 తేదీన మరో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని గుడ్ న్యూస్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube