నవంబర్ 3 అమెరికాలో జరుగనున్న ఎన్నికలు యావత్ ప్రపంచ తీరును మార్చేయనున్నాయి.ఈ ఎన్నికల్లో గెలిస్తే తమకు తమ ఆధిపత్యానికి చెక్ పెడుతుందని ఒక పక్క చైనా వణుకుతుంది.
మరోపక్క అమెరికా మిత్రపక్షాలు అమెరికా అధ్యక్షుడిగా జోబిడెన్ అయితే అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే అంశాలపై కీలక దృష్టిని సారించాయి.ఇక ఎప్పటిలాగే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కూడా మళ్ళీ భారతీయులు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలవనున్నారు.
వారిని ప్రసన్నం చేసుకోవడానికి అటు ట్రంప్ ఇటు జో బిడెన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.మొదటి నుండి ట్రంప్ కు దూరంగా ఉంటున్న భారతీయులు నరేంద్ర మోడీ హౌడీ మోడీ ఈవెంట్ తర్వాత ట్రంప్ కు కూసింత దగ్గరయ్యారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ట్రంప్ కు అధికారంలోకి రావడం మార్గం సుగమం అయ్యేది.కాని కరోనా ఉన్నట్లుండి రావడం దానిని కంట్రోల్ చేయడంలో ట్రంప్ సర్కార్ విఫలమవడంతో అక్కడ ఆయనకు పాజిటివ్ ఇమేజ్ కాస్త నెగిటివ్ అయ్యింది.
దాన్ని కవర్ చేసుకోవడం కోసం ట్రంప్ భారతీయుల అమెరికా ఎంట్రీపై పెట్టిన ఆంక్షలు, ప్రైవేట్ ఉద్యోగాల విషయంలో అమెరికన్స్ కే ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ఉత్తరువులు ఆయనను అమెరికన్లకు దగ్గర చేయకపోగా ఇండియన్స్ లో వ్యతిరేకత తెచ్చి పెట్టింది.

దీన్ని క్యాష్ చేసుకోవడానికి జోబిడెన్ భారత మూలాలు ఉన్న కమలా హ్యారిస్ ను రంగంలోకి దింపారు.దానితో భారత ఓటర్స్ అటు మళ్ళినట్లు నివేదికలు చెబుతున్నాయి.మరి దీనికి ప్రతిగా డోనాల్డ్ ట్రంప్ ఎటువంటి ఎత్తులు వేస్తారు.
భారతీయులను ఎలా ప్రసన్నం చేసుకుంటారో అని విశ్లేషకులు ఆసక్తిగా అమెరికన్ ఎలక్షన్స్ వైపు చూస్తున్నారు.