టాలీవుడ్ ప్రేక్షకుల మదుల్లో హాసినీ గా ముద్ర వేసుకొని తన అల్లరితనంతో పక్కింటి అమ్మాయిలాగా పేరు తెచ్చుకుంది జెనీలియా( Jenelia ).ఈమె మొదట్లో తరుణ్ హీరోగా చేసిన నువ్వే కావాలి సినిమా రీమేక్ గా హిందీలో వచ్చిన తుజే మేరీ కసం అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయమైంది.
ఆ తర్వాత మొదటిసారి బాయ్స్ ( Boys ) సినిమాతో తెలుగు చిత్ర ప్రేక్షకులను అలరించింది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో జెనీలియా కి తెలుగులో సత్యం సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది.
ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయింది.దాంతో ఎన్టీఆర్ నా అల్లుడు, సాంబ వంటి సినిమాల్లో కూడా వరుసగా అవకాశం వచ్చింది.
అంతేకాకుండా ఈమె నటించిన బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీ ఢీ ( Dhee ) కూడా సూపర్ హిట్ అవ్వడంతో జెనీలియా పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.కానీ తెలుగులో మరో సినిమాలో అవకాశం రాలేదు.దాంతో హిందీలో ఓ సినిమాలో నటించింది.
కానీ ఈమె నటించే సినిమాలు వరుసగా హిట్ అయినప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు.దానికి ప్రధాన కారణం అప్పటికే జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ( Rithesh deshmukh ) తో రిలేషన్ లో ఉండడం.
ఈ కారణం తోనే చాలామంది హీరోలు ఆమెతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడలేదు.అయితే వీరి ప్రేమ విషయం చెప్పి ఇంట్లో వాళ్ళని పెళ్లికి ఒప్పించింది జెనీలియా.
కానీ రితేష్ ఇంట్లో వాళ్ళు మాత్రం జెనీలియా ని కోడలు గా ఒప్పుకోలేదు.ఎందుకంటే ఆమె హీరోయిన్ అలాగే క్రిస్టియన్ కావడంతో వద్దన్నారు.
అయినప్పటికీ రితేష్ పట్టుబట్టి మరీ వారిని పెళ్లికి ఒప్పించారు.అయితే పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వాలి అని చెప్పారు.
దానికి రితేష్ నేను మొత్తం చూసుకుంటాను అని అన్నారట.

అయితే అదే సమయంలో మరొక చిక్కు వచ్చి పడింది.అదేంటంటే జెనీలియా గురించి బీటౌన్ లో ఒక వార్త చక్కర్లు కొట్టింది.అదేంటంటే రితేష్ దేశ్ ముఖ్ తో పెళ్లి పెట్టుకొని మరో స్టార్ హీరోని జెనీలియా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
దీంతో ఈ విషయం రితేష్ ఫ్యామిలీకి తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు.కానీ ఆ తర్వాత జెనీలియా కి సంబంధించిన ఆ ఫోటోలు తనకొత్త సినిమాకి సంబంధించిన ఫొటోస్ అని, కావాలనే కొంతమంది వీటిని చెడు ప్రచారం చేశారని బయటపడింది.
ఇక జెనీలియా సీక్రెట్ గా ఆ హీరో ని పెళ్లి చేసుకుందనే వార్తల్లో ఉన్న హీరో ఎవరో కాదు జాన్ అబ్రహం( Jhan abraham ) .జాన్ అబ్రహం జెనీలియా కాంబినేషన్లో వచ్చిన ఫోర్స్( Force ) సినిమాలోని కొన్ని ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొట్టి వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపించినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ వచ్చింది.దాంతో జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ల పెళ్లి జరిగింది.