బుల్లితెరపై ప్రసరమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ అందరికీ తెలిసే ఉండొచ్చు.ఈ సీరియల్ లోని పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందులో ముఖ్యంగా జానకి పాత్రలో నటిస్తున్న ప్రియాంక జైన్ మనకు చాలా దగ్గరైన నటి.తొలిసారిగా మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఇందులో ప్రియాంక నటించిన అమ్ములు పాత్ర మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తొస్తూ ఉంటుంది.
ఈ సీరియల్ లో తాను మూగ అమ్మాయిగా నటించి ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది ప్రియాంక జైన్. ఇక ప్రియాంక తన అందంతో కూడా బాగా ఆకట్టుకుంది.
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అందులో గోలి సోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార వంటి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.
ప్రస్తుతం తాను జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సీరియల్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.
ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
ఇక ప్రియాంక తనతో కలిసి మౌనరాగంలో నటించిన అంకిత్ అలియాస్ శివ కుమార్ కు తన జీవితం ఇచ్చింది.
ఇక వీరిద్దరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.అప్పుడప్పుడు ప్రియాంక శివ ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఏదైనా బుల్లితెర ఈవెంట్ లో కూడా ఇద్దరు కలిసి స్పెషల్ పర్ఫామెన్స్ ఇస్తుంటారు.
ఇదంతా పక్కన పెడితే అప్పుడప్పుడు ప్రియాంక కొన్ని మోటివేషనల్ స్టోరీస్ పంచుకుంటూ ఉంటుంది.తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకోగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.
అందులో తను పంచుకుంది ఏందంటే.మన జీవితంలో అధిక సంపాదన ఏదైనా ఉంది అంటే అది డబ్బు, బంగారం కాదు.ప్రశాంతంగా ఉండటం అని తెలిపింది.అంటే ప్రశాంతంగా ఉంటే దాని కంటే మించిన సంపాదన ఉండదు అన్నట్లుగా తెలిపింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఆమె షేర్ చేసుకున్న పోస్ట్ వైరల్ అవ్వడంతో.అది చూసిన నెటిజన్లు కరెక్ట్ చెప్పారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రియాంక జైన్ కు స్టార్ హీరో నాగార్జున సినిమాలో అవకాశం అందుకుందని గతంలో వార్తలు వినిపించాయి.అందులో ప్రియాంక నాగార్జునకు చెల్లెలి పాత్రలో నటించనున్నట్లు టాక్ కూడా వినిపించింది.
అంతేకాకుండా మరో రెండు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుందని వార్తలు వినిపించాయి కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు.