ఏపీ మూడు రాజధానులు విషయంలో వెనక్కి తగ్గిన జగన్ ప్రభుత్వం..!!

ఏపీ సీఎం గా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో.ఒకటి.

 Jagan Governament Withdrawal Three Capital Bill Ap Capital,  Ys Jagan,  Three Ca-TeluguStop.com

రాష్ట్రానికి మూడు రాజధానులు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించక ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధానిని విస్తరిస్తూ కర్నూలులో న్యాయ రాజధానితో పాటు.

విశాఖపట్టణం నుండి పరిపాలన రాజధాని గా గుర్తించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో.

ఉన్నఫలంగా ఒక్కసారిగా 3 రాజధానుల నిర్ణయం విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

విషయంలోకి వెళితే సీఆర్డీడీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు సంబంధించి కేసులు హైకోర్టు రోజు వారి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది.మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి తెలపడం జరిగింది.హఠాత్తుగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు విషయంలో వెనక్కి తగ్గినట్లు తీసుకున్న నిర్ణయం.

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అత్యవసర ఏపీ కేబినెట్ భేటీలో పరిపాలన వికేంద్రీకరణ.

సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరిస్తు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే పలు మార్పులతో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరికాసేపట్లో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube