టీఆర్ఎస్‎పై దూకుడు పెంచిన కోమటిరెడ్డి

టీఆర్ఎస్‎పై దూకుడు పెంచిన కోమటిరెడ్డితెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారిస్తోంది.ఇప్పటికే తెలంగాణలో నెలకొన్న కాంగ్రెస్ పరిస్థితులను చక్కదిద్దేందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు.

 Komatireddy Raised Aggression Against Trs , Komatireddy Rajagopalreddy, Venkatr-TeluguStop.com

కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నించాలని నాయకులకు దిశానిర్థేశం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పై విమర్శలు చేస్తున్న జగ్గారెడ్డి కూడా ఇటీవల రాహుల్ గాంధీని కలిశారు.

తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తామని అన్నారు జగ్గారెడ్డి.

కోమటిరెడ్డి బ్రదర్స్ కదలికలు, రాజకీయ వ్యూహాలు ఢిల్లీ స్థాయిలో ఉండటంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అగ్రనేతలకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఉన్న పరిచయం, ఫాలోయింగ్‌తో ప్రతి విషయానికి డైరెక్ట్‌గా బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్తే .ఇక తమకు ఏం గుర్తింపు ఉంటుందనే ఆలోచనతో ఉన్నారని సమాచారం.అందుకే ఎలాగైనా కోమటిరెడ్డి బ్రదర్స్‌ని కమలం గూటికి చేరకుండా తమ వంతు ప్రయత్నాలను తెర వెనుక నుంచి సైలెంట్‌గా చేసుకుపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.ఎన్నికల్లో గెలిచినా తమను పట్టించుకోని కాంగ్రెస్‌ని విడిచిపెడదామనుకుంటే.

బీజేపీలో చేరక ముందే కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఆపార్టీ రాష్ట్ర స్థాయి నేతల రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి పడ్డాయి.

Telugu Congress, Delhi, Komati Brothers, Komati Trs, Venkat-Political

సార్వత్రిక ఎన్నికలు ముందుగా అనుకున్న సమయానికి జరుగుతాయనే గ్యారెంటీ లేదు.సీఎం కేసీఆర్ ముందస్తుకైనా సిద్ధమనే సంకేతం ఇవ్వడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ డైలమాలో పడ్డట్లుగా కనిపిస్తోంది.ఇటు కాంగ్రెస్‌లో ఉండలేక.

ఆటు బీజేపీలో చేరలేకపోతున్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పొలిటికల్ సిస్ట్యూవేషన్ చూస్తుంటే మింగలేక.

కక్కలేక అన్న సామెత సరిగ్గా సరిపోతుందంటు్నారు రాజకీయ విశ్లేషకులు.ఇంతకీ వీళ్లిద్దరూ సర్దుకుపోయి కాంగ్రెస్‌లో కొనసాగుతారా ? లేక కమలం కండువా కప్పుకుంటారా ? లేదంటే రాజకీయ భిక్షపెట్టిన రాజన్న కూతురు షర్మిల పెట్టిన వైఎస్ఆర్‌టీపీలో చేరతారా అనే డౌట్స్‌ నల్లగొండ ప్రజలతో పాటు పొలిటికల్‌ సర్కిల్‌లో తెగ చర్చ నడుస్తోంది.కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ స్టెప్ తీసుకుంటారో చూద్దాం అనే ఆసక్తిలో వారి అనుచరులు, అభిమానులు, మద్దతురాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Telugu Congress, Delhi, Komati Brothers, Komati Trs, Venkat-Political

టీఆర్‌ఎస్‌ ఓడిస్తాం, కేసీఆర్‌ని గద్దె దించుతామని పదే పదే శపధం చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పార్టీ మారడానికి అధికార టీఆర్‌ఎస్‌ మినహాయిస్తే మిగిలిన బీజేపీ ఒక్కటే కనిపిస్తోంది.అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అదైతేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.అయితే ఇద్దరి ఆలోచనలు ఇలా ఉంటే .తమకు వ్యక్తిగత గుర్తింపు ఉండాలన్నది కోమటిరెడ్డి బ్రదర్స్ మెయిన్‌ డిమాండ్.అందుకోసమే ఇద్దరూ ఢిల్లీ స్థాయి నేతలతోనే టచ్‌లో ఉంటున్నారు.

గతంలో రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా గెలిచి ఢిల్లీలో కాస్తో కూస్తో పట్టు సాధించుకున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తెలంగాణ స్టార్ క్యాంపెనర్ గా కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డిని నియమించింది.ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింతగా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది.ఇదిలా ఉంటే తెలంగాణలో త్వరలోనే రాహుల్ గాంధీ బహిరంగ సభ జరుగే అవకాశం కనిపిస్తోంది.

ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరగా…రాహుల్ గాంధీ అందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.వరంగల్ వేదికగా ఈ సభ జరిగే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube