సీనియర్లకు ఆ విధంగా చెక్ ! బాబు తెలివి మామూలుగా లేదు ? 

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా యువనేతలను పోటీకి దింపాలని టిడిపి అధినేత చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.దాదాపు నలభై శాతంకి పైగా సీట్లను యువ నాయకులకే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

 Jagan Decides To Allocate Mp Tickets To Tdp Senior Leaders , Tdp , Chandrababu ,-TeluguStop.com

పార్టీలో పెద్దఎత్తున సీనియర్ నాయకులు ఉన్నా,  ప్రస్తుత పరిస్థితుల్లో వారి వేగం సరిపోదని,  యువ నాయకులు అయితే ప్రజల్లోకి వెళ్లడం తో పాటు,  రాజకీయ ప్రత్యర్థులను దూకుడుగా ఎదుర్కో గలరు అని బలంగా బాబు నమ్ముతున్నారు.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇక జనసేన, బీజేపీ వంటి పార్టీలతోను పొత్తు పెట్టుకునేందుకు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఖచ్చితంగా జనసేన , బిజెపి పార్టీల తో కలిసి 2014 ఎన్నికలను ఎదుర్కొంటామని బాబు నమ్ముతున్నారు.

పొత్తు కనుక కుదిరితే మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు విషయంలో అనవసర తలనొప్పులు తలెత్తకుండా , ఇప్పటి నుంచే బాబు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారట.

వరుస ఎన్నికల్లో ఓటమి చెందుతూ వస్తున్న సీనియర్ నాయకులందరినీ ఇక అసెంబ్లీ రేసు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారట.

అయితే వారిలో అసంతృప్తి తలెత్తకుండా ఎంపీ టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులు ఎంపీ టికెట్లు ఇవ్వడం ద్వారా , వారి ప్రాధాన్యాన్ని మరింత పెంచినట్లు వారు భావిస్తారని, పొత్తులో భాగంగా టీడీపీ జనసేన లకు అసెంబ్లీ స్థానాలు కేటాయించే సమయంలో ఇబ్బందులు ఏర్పడవని , అలాగే ఎంపీ స్థానాలలో టిడిపి సీనియర్ నాయకులు గెలిస్తే ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఆలోచన బాబు ఉన్నారట.
 

Telugu Ap, Chandrababu, Jagan, Tdp, Ysrcp-Telugu Political News

అందుకే ఇప్పటి నుంచే పొత్తుల అంశంపై చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నారట.జనసేన,  బీజేపీలకు ఏఏ నియోజకవర్గాలను కేటాయించే అవకాశం ఉంది ? ఏ నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే విషయాలపై ముందస్తుగానే బాబు కసరత్తు చేస్తున్నారట.చంద్రబాబు తాజా నిర్ణయంతో పార్టీ సీనియర్లు సైతం ఒకింత ఆందోళనకు గురవుతున్నారట.ఎంపీ స్థానాల్లో పోటీ అంటే ఆషామాషీ ఉండదని,  భారీగా సొమ్ములు ఖర్చు కావడం తో పాటు, ఆ లోక్ సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీగానే సొమ్ములు సర్దుబాటు చేయాల్సి వస్తుందని,  గెలుపు అవకాశం అంత అషామాషిగా ఉండదనే లెక్కల్లో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube