తెలుగు సినీ రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది.సీనియర్ నటుడు శరత్ బాబు( actor Sarath Babu ) తుది శ్వాస విడిచారు .
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు.కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు ( Lungs, liver, kidneys )వంటి ప్రధాన అవయావాలు గతంలో పాడైపోయాయి.
దీనితో గత కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆయన… వైద్యుల సూచనతో నెల క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి( Hyderabad AIG Hospital ) మార్చారు.వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు.
అయినా ఆయన కోలుకోలేకపోయారు.సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన కన్నుమూశారు.ఇక శరత్ బాబు సినీ , కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే .
1951 జులై 31న విజయశంకర దీక్షితులు, సుశీలాదేవి( Vijayashankara Dixitulu, Sushila Devi ) దంపతులకు శరత్‌బాబు జన్మించారు.శరత్‌బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు.సత్యనారాయణ దీక్షితులు అని కూడా చెబుతుంటారు.ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస.కాన్పూర్ నుంచి శరత్‌బాబు కుటుంబం ఆమదాలవలసకు వలస వచ్చింది.
ఆమదాలవలసలో రైల్వే క్యాంటీన్‌ను శరత్‌బాబు కుటుంబం నడిపేది.ఆ సమయంలో శరత్‌బాబు నాటకాల్లో నటించేవారు.
కాలేజీ రోజుల్లో చాలా నాటకాల్లో నటించారు.శ్రీకాకుళం జిల్లాకే చెందిన ప్లే బ్యాక్ సింగర్ జి.ఆనంద్ శరత్‌బాబును మద్రాసు తీసుకువెళ్లారు.శరత్‌బాబు మద్రాసు వెళ్లిన కొన్నాళ్లకే ఆయనకు సినిమాల్లో అవకాశం వచ్చింది.
1973లో విడుదలైన రామరాజ్యం ( Ramarajyam )సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు .తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 250కి పైగా సినిమాలలో నటించారు.హీరో నుంచి విలన్ దాకా ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడుగా శరత్ బాబు ని చెప్పుకుంటారు .నాలుగున్నర దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనేక చిత్రాలు చేశారు.తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు ఎక్కువ ఆదరణ లభించిందని చెప్పవచ్చు.వందలాది సినిమాలు చేసిన ఆయన తన దగ్గరకు వచ్చే ఏ పాత్రనైనా ప్రాణం పెట్టి చేస్తారు .చిన్నపుడు శరత్‌బాబుకు పోలీస్ కావాలని ఉండేది.ఫ్రెండ్స్, టీచర్లు అంతా నువ్వు హీరోలా ఉంటావు, సినిమాల్లో ట్రై చేయకపోయావా?.అని సలహా ఇచ్చారు.ఈ మాటలు శరత్‌బాబు తల్లిని ఆలోచింపజేశాయి.తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో మద్రాసు చేరి అవకాశాల కోసం ప్రయత్నించారు శరత్ బాబు.ఆ సమయంలో రామవిజేత సంస్థ నూతన నటీనటుల కోసం పేపర్‌లో ప్రకటన ఇచ్చింది.
దాదాపు వెయ్యి అప్లికేషన్లు వస్తే ముగ్గుర్ని సెలక్ట్ చేశారు.ఆ ముగ్గురికీ స్క్రీన్ టెస్ట్ చేసి అందులో శరత్‌బాబును హీరోగా సెలక్ట్ చేశారు.
అలా 1973లో రామరాజ్యం సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అమెరికా అమ్మాయి, బంగారు మనిషి, పంతులమ్మ, చిలకమ్మ చెప్పింది, సీతాకోక చిలుక వంటి సినిమాలు ఆయనకు ఆదరణ తీసుకువచ్చాయి.
శరత్ బాబు రామప్రభని( Ramaprabha ) వివాహం చేసుకున్నారు .అప్పట్లో కమెడియన్‌గా స్టార్ హోదాలో ఉన్న రమాప్రభతో పరిచయం ఏర్పడటం, అది ప్రేమకు దారి తీయడంతో వీరి పెళ్లి కూడా జరిగిపోయింది.14 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు.ఆమెకు సైతం విడాకులిచ్చేశారు.ఆ తర్వాత నమితను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది కానీ అదంతా వుట్టి పుకారు అని ఆయనే స్వయంగా కొట్టిపారేశారు.అయినప్పటికీ ఆయన సీక్రెట్‌గా ఎవరినో మూడో పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం మాత్రం ఆగలేదు.
ఇక తన పిల్లల గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా తన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలు 25 మంది తన తన పిల్లలే అని సరదాగా చెబుతుండేవారు.ఇక శరత్ బాబు ఆస్తులపై కూడా చాలా వార్తలు వచ్చాయి .గతం లో ఆంధ్ర ప్రదేశ్ లో తనకి ఉన్న వ్యాపారాల గురించిఅయన చెప్పిన మాటలు అప్పట్లో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.నాకు వ్యాపారాల మీద కానీ, సినిమాల మీద కానీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, నాకు మొదటి నుండి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది.
సెలెక్షన్స్ కి వెళ్లే సమయం లోనే నాకు సైట్ వచ్చింది.ఇక అక్కడితో పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కలని మర్చిపోయాను.పోలీస్ కాకపోతే సినిమాల్లో రావాలని అప్పుడే నిశ్చయించుకున్నాను.అవకాశాల కోసం బాగా కష్టపడ్డాను, కె బాలచందర్ నన్ను చూడగానే ఎంతగానో నచ్చి నాకు మొదటి సినిమాలోనే హీరో గా చేసే ఛాన్స్ ఇచ్చాడు, ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది.
ఇక తండ్రి గారి తదనంతరం ఆయన వ్యాపారాలన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది.ఆంధ్ర ప్రదేశ్ లో నాకు చాలా పెద్ద వ్యాపారాలు ఉన్నాయి.
ఆదాయం కూడా భారీ గానే వస్తుంది అంటూ సమాధానం చెప్పాడు.ఇక ఇప్పటికి ఆయనకి బాగానే ఆస్తులు ఉన్నాయని అంటారు .