16 ఉద్యోగాలను తిరస్కరించింది.. చివరకు ఐపీఎస్.. ఈ యువతి సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

ఐపీఎస్ సాధించాలంటే ఉండే కష్టాలు అన్నీఇన్నీ కావు.మన దేశంలోని విజయవంతమైన ఐపీఎస్ అధికారులలో తృప్తీ భట్( Trupti Bhatt ) ఒకరు కాగా ఆమె సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

 Ips Trupti Bhatt Success Story Details, Trupti Bhatt, Trupti Bhatt Success Story-TeluguStop.com

తన లక్ష్యాన్ని సులువుగానే సాధించిన తృప్తీ భట్ తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు.ఉత్తరాఖండ్‌ లోని( Uttarakhand ) అల్మోరాకు చెందిన తృప్తీభట్ సక్సెస్ స్టోరీ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తృప్తీ భట్ ఇప్పటివరకు 16 ఉద్యోగాలను సాధించినా వేర్వేరు కారణాల వల్ల ఆ ఉద్యోగాలను రిజెక్ట్ చేశారు.చివరకు ఐపీఎస్ ను ( IPS ) ఎంచుకున్న తృప్తీభట్ తన సక్సెస్ స్టోరీతో ఎంతోమందికి స్పూర్తిగా నిలవడంతో పాటు కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన తృప్తీ భట్ బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవారు.మెకానికల్ ఇంజనీరింగ్ లో( Mechanical Engineering ) బీటెక్ చదివిన ఈ యువతి ఇస్రోతో పాటు ఆరు ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు అందుకున్నారు.

బాల్యంలోనే ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కన్న తృప్తి తనకు వచ్చిన అద్భుతమైన అవకాశాలను వదులుకుని ఒక్కో మెట్టు పైకి ఎదిగారు.తైక్వాండో, కరాటేలో శిక్షణ తీసుకోవడంతో పాటు మారథాన్, బ్యాడ్మింటన్ పోటీలలో సత్తా చాటి బంగారు పతకాలను( Gold Medals ) సాధించారు.తృప్తీ భట్ 16 ఉన్నత ఉద్యోగాలను రిజెక్ట్ చేశారంటే ఐపీఎస్ కావాలనే తన లక్ష్యం ఎంత బలమైనదో అర్థమవుతుంది.

తృప్తీ భట్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.తృప్తీ భట్ తొలి ప్రయతంలోనే 165వ ర్యాంక్ తో ఐపీఎస్ కావాలనే లక్ష్యాన్ని సాధించారు.టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆమె ప్రూవ్ చేశారు.

తృప్తీ భట్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఫిదా చేస్తుండటం గమనార్హం.

IPS Tripti Bhatt Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube