50 ఏండ్లకే జంధ్యాల చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

జంధ్యాల.తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడు.తన రచనలతో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు.సినిమా రచయితగా.దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు.తన 25 ఏండ్ల సినిమా కెరీర్లో కేవలం 39 సినిమాలకు దర్శకత్వం వహించాడు.350 సినిమాలకు కథ అందించాడు.ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.

 Why Jandhyala Dead Before Fifty Years, Jandhyala, Dead, Before 50 Years, Jandhya-TeluguStop.com

జంధ్యాల సినిమా కెరీర్ లో ఎన్నో చక్కటి పాత్రలు సృష్టించిన.అందరిచేత ప్రశంసలు పొందాడు.

ఆయన 50 ఏండ్లకే చనిపోవడానికి అసలు కారణం వేరే ఉంది అంటారు సినీ జనాలు.ఆయనకు విపరీతమైన మద్యపానం అలవాటు ఉండేది.ఆ తాగుడే తనకు చేటు అయ్యింది.తాగుడు కారణం మూలంగానే ఆయన కన్నుమూశారు అనే మాట తరచూ వినిపించేది.

జంధ్యాల ఒక్కడే కాదు సినిమా రంగంలోని చాలా మందికి తాగుడు అలవాటు ఉంది.ఆ కారణంగా పలువురు జీవితాలను కోల్పోయారు కూడా.

తను ఎన్నో హాస్య చిత్రాలు తీసినా.ఎన్నో సినిమాలకు రచనలు చేసినా.చాలా సాధారణంగా ఉండేవాడు.ఎక్కడా అతి ప్రదర్శన ఉండేది కాదు.

ఆయన పౌరాణిక సినిమాలత పాటు ప్రేమ కథలు, గ్లామర్ కథలు, హాస్య సినిమాలు ఒకటేమిటి అన్ని రకాల కథలను టచ్ చేసాడు ఆయన.

Telugu Bee, Jandhyala, Ramanaidu, Rajendra Prasad, Duper, Tollywood-Telugu Stop

అటు తను తీసిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించినా.తనకు బాగా నచ్చిన సినిమా ఆహా నాపెళ్ళంట.రామానాయుడు కొరిక మేరకు ఆయన నిర్మాతగా జంధ్యాల ఈ సినిమా తీశాడు.

ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో సూపర్ డూపర్ హిట్ కొట్టింది.తెలుగు సినిమా పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.ఈ సినిమా నిర్మాత రామానాయుడు, దర్శకుడు జంధ్యాల, హీరో రాజేంద్రప్రసాద్, కమెడియన్లు కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం సహా పలువురుకి మంచి పేరు సంపాదించి పెట్టింది.25 ఏండ్లకు సినిమా రంగంలోకి వచ్చిన జంధ్యాల.25 సంవత్సరాల పాటు సినీ కెరీర్ కొనసాగించాడు.50 ఇండ్లకు భువి నుంచి దివికి ఎగిసాడు.తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube