ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట‘.పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమాకు తమన్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమాలోని మహేష్ బాబు ఫ్రీ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ గా ఉంటుందని సమాచారం.
ఈ సినిమా బ్యాంకింగ్ రంగాల వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇక ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా, కీర్తి సురేష్ అదే బ్యాంకులో పనిచేసే ఉద్యోగినిగా కనిపించనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా మొత్తం మహేష్ బాబు పాత్ర చుట్టూ కామెడీ ట్రాక్ ఉంటుందని తాజా అప్ డేట్ లో తెలిసింది.
ఈ సినిమాలో పరశురాం ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కామెడీ ట్రాక్ ను కూడా రాశాడట.

ఇందులో బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కూడా నటిస్తుండగా.వీరి మధ్య కామెడీ నడుస్తుందని, ఈ కామెడీ ట్రాక్ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.ఇక ఈ కామెడీ మొత్తం సెకండ్ హాఫ్ లో రావడంతో పాటు.మొత్తానికి మహేష్ పాత్ర చుట్టూ ఈ కామెడీ తిరుగుతుందని తెలిసింది.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లవర్ బాయ్ గా కనిపించనున్నాడని టాక్.భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వరుస ప్రాజెక్టులకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.