అక్కినేని హీరో నాగార్జున సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అన్నమయ్య సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కె.
రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అప్పటివరకు రొమాంటిక్ సినిమాలలో నటించిన నాగార్జున ఇమేజ్ ను ఒక విధంగా అన్నమయ్య సినిమా మార్చిందనే చెప్పాలి.
అక్కినేని ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం.
భక్తిరస సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం సులువు కాదు.
అయితే నాగార్జున మాత్రం అన్నమయ్య పాత్రలో జీవించారనే చెప్పాలి.అన్నమయ్య సినిమా సక్సెస్ లో సంగీతం కీలక పాత్ర పోషించగా ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారనే సంగతి తెలిసిందే.
ఈతరం ప్రేక్షకులు సైతం అన్నమయ్య సినిమాలోని పాటలను ఎంతగానో ఇష్టపడతారు.ఈ సినిమాలో వేంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించడం గమనార్హం.
రిలీజైన సమయంలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

అయితే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.అన్నమయ్య ఈ సినిమాలో హీరో అని తెలిసిన వెంటనే చాలామంది నెగిటివ్ కామెంట్లు చేశారు.అన్నమయ్య పాత్రకు నాగ్ సూట్ కారని చాలామంది కామెంట్లు చేశారు.

అయితే ఆ విమర్శలను పట్టించుకోకుండా నాగార్జున, రాఘవేంద్రరావు ముందడుగులు వేయగా ఈ సినిమా సక్సెస్ సాధించింది.దొరస్వామిరాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.సినిమా విడుదలైన తర్వాత నాగార్జున అభినయాన్ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.మొదట వేంకటేశ్వర స్వామి పాత్రలో శోభన్ బాబును నటింపజేయాలనే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.