అమెరికా అధ్యక్ష ఎన్నికల( US presidential election ) ప్రచారం ఊపందుకుంది.రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు పోటీ అవుతాడనుకున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) అనూహ్య కారణాల మధ్య రేసులోంచి తప్పుకున్నారు.
ఇదే సమయంలో మరో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు.ఆమెను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఈ క్రమంలో నిక్కీ హేలీకి ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamoorthi ) అండగా నిలిచారు.గత వారం ట్రంప్.
‘‘ ది గేట్ వే పండిట్ ’’ చేసిన పోస్ట్‌ను మరోసారి పోస్ట్ చేశారు.హేలీ 1972లో జన్మించిన సమయంలో ఆమె తల్లిదండ్రులు అమెరికా పౌరురాలు కానందున, యూఎస్ ప్రెసిడెంట్ లేదా వైఎస్ ప్రెసిడెంట్‌గా వుండటానికి అనర్హురాలన్నది ఆ పోస్ట్ సారాంశం.
అయితే నిక్కీ హేలీ అమెరికాలోనే పుట్టినందున జన్మత: దేశ పౌరసత్వం లభించినట్లేనని ఆమె వర్గం కౌంటర్ ఇస్తోంది.

డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తప్పుడు, జాత్యహంకార వాదనలు చేయడంలో ఆశ్చర్యం లేదని రాజా కృష్ణమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దక్షిణాసియా కమ్యూనిటీకి మద్ధతు ఇస్తున్నట్లు చెప్పుకునే ఏ రిపబ్లికన్ అయినా ఈ వ్యాఖ్యలను ఖండించాలని కృష్ణమూర్తి సూచించారు.యూఎస్ రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేవారికి కనీసం 35 ఏళ్ల వయసు నిండి వుండాలని, జన్మత: అమెరికాలో జన్మించి వుండాలి.లేదా 14 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ వుండాలి.

అంతర్యుద్ధం తర్వాత ఆమోదించిన 14వ సవరణలోని సెక్షన్ 3 ప్రాకరం.రాజ్యాంగానికి మద్ధతుగా ప్రమాణం చేసిన అమెరికాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా లేదా సహాయం చేసినా .అలాంటి వారు పౌర, సైనిక పదవిని నిర్వహించడానికి అనర్హులని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ల పుట్టుకపైనా ట్రంప్ గతంలో తీవ్ర విమర్శలు గుప్పించారు.జన్మత: అమెరికా పౌరసత్వం వర్తింపజేసే విధానానికి స్వస్తి పలకాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.