ఐఐటీల్లో విద్యార్థుల బలవన్మరణాలు బాధాకరమని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ అన్నారు.ఈ క్రమంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ కోసం విద్యాసంస్థల్లో కమిటీలు వేశామని పేర్కొన్నారు.
తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో సమ్మక్క -సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ తెలిపారు.నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దాదాపు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు.దేశ వ్యాప్తంగా 2014లో 350 స్టార్టప్ కంపెనీలు ఉంటే ఇప్పుడు సుమారు 1.30 లక్షలకు పైగా ఉన్నాయని చెప్పారు.నూతన ఆవిష్కరణలకు ఇండియా కేరాఫ్ గా మారిందని తెలిపారు.