మహిళా విద్యార్ధినిని లైంగికంగా వేధించినందుకు గాను సింగపూర్( Singapore )లో భారతీయుడికి న్యాయస్థానం 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితుడిని అమృత్ కుమార్( Amrit Kumar ) గా గుర్తించారు.
డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టాన్ జింగ్ మిన్( Tan Jing Min ) ఏప్రిల్ 2022లో కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.టెలోక్ అయర్ స్ట్రీట్‌లోని ట్రస్ట్ యోగాలో బాధితురాలు ఓ ప్యాకేజ్ కొనుగోలు చేశారు.
ఈ క్రమంలో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా వున్న కుమార్ బాధితురాలి వీపును ఆమె అనుమతి లేకుండా తాకడమే కాకుండా బలవంతం చేసినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.
యోగా సమయంలో బాధితురాలిని ఒక భంగిమ నుంచి మరొక భంగిమకు మార్చే క్రమంలో కుమార్ మౌఖిక సూచనలను మాత్రమే ఇచ్చాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ చేయమని ఆమెకు చెప్పే ముందు కనీస హెచ్చరికలు లేకుండా బాధితురాలి పొజిషన్ మార్చాడని సదరు పత్రాల్లో ప్రస్తావించారు.ఊహించని ఈ సంఘటనకు షాకైన బాధితురాలు.
మీ చేతులు దూరంగా వుంచాలని కుమార్‌ను హెచ్చరించింది.ఆ తర్వాత రోజే ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఇకపోతే .కొద్దిరోజుల క్రితం ఇదే సింగపూర్‌లో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్న భారతీయుడిపైనా లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశారు పోలీసులు.అతనిని రాజ్‌పాల్ సింగ్‌గా గుర్తించారు.సెంట్రా బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో యోగా సెంటర్‌లో రాజ్‌పాల్ నలుగురు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు .ప్రాసిక్యూటర్లు 8 అభియోగాలు నమోదు చేశారు.33 ఏళ్ల రాజ్‌పాల్ సింగ్ ( Rajpal Singh ).ఏప్రిల్ 1, 2019 నుంచి టెలోక్ అయర్ స్ట్రీట్‌లోని ట్రస్ట్ యోగాలో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.అయితే అతను మరో మహిళపైనా వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
దీనిపై తర్వాత విచారణ జరిగే అవకాశం వుందని మీడియా తెలిపింది.కోర్ట్ గ్యాగ్ ఆర్డర్ కారణంగా ఐదుగురు మహిళల పేర్లు బయటకి వెల్లడించరాదు.
లైంగిక వేధింపుల కేసుల్లో భారతీయులు వరుసపెట్టి ఆరోపణలు ఎదుర్కొంటూ వుండటంతో సింగపూర్‌లో పెద్ద చర్చ నడుస్తోంది.