వన్డే సిరీస్ ఫార్మాట్ పై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలా మారిస్తే బెటర్ అంట..!

ఇటీవలే ఢిల్లీలో ఇండియా టుడే కాన్ క్లేవ్ లో మాట్లాడిన సచిన్ టెండుల్కర్ వన్డే సిరీస్ ఫార్మాట్( ODI series ) చాలా బోర్ కొడుతుందని, అందులో మార్పులు అవసరం అని కీలక సూచనలు చేశాడు.వన్డే సిరీస్ బోర్ కొట్టడానికి ప్రధాన కారణం ఫార్మాట్ అయితే.

 Sachin Tendulkar's Interesting Comments On Odi Series Format , Sachin Tendulkar-TeluguStop.com

రెండవది మ్యాచ్లో ఉపయోగించే రెండు బంతుల వల్ల రివర్స్ స్వింగ్ చేసే ఛాన్స్ దక్కకపోవడం.బంతి రివర్స్ స్వింగ్ కావాలంటే 30 ఓవర్లు పడుతుందని చెప్పాడు.

అంతేకాకుండా చివరి 10 ఓవర్లలో ఐదుగురు ఫిల్డర్లు సర్కిల్ లోపల ఉండాలన్న నిబంధన సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇలా ఉండడం వల్ల వికెట్లు పడే ఛాన్స్ కన్నా .స్కోరు భారీ దిశగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) అభిప్రాయపడ్డాడు.వన్డే సిరీస్ ను టెస్ట్ సిరీస్ లాగా 25 ఓవర్లకు కుదించి, నాలుగు భాగాలుగా ఆడితే ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాడు.

అంటే ఒక టీం 25 ఓవర్లు ఆయన తర్వాత మరొక టీం 25 ఓవర్లు ఆడుతుంది.తొలి 25 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోతే.తర్వాత 25 ఓవర్లు ఉండ కూడదు.

టెండూల్కర్ అభిప్రాయం వెనక అసలు కారణం ఏమిటంటే శ్రీలంకతో( Sri Lanka ) జరిగిన ఒక మ్యాచ్లో 118 ఓవర్లు ఆడిన ఫలితం దక్కలేదు.మొదటి రోజు శ్రీలంక బ్యాటింగ్ పది ఓవర్లు ఆడింది.తర్వాత వర్షం పడటంతో మ్యాచ్ రద్దు అయింది.

ఆ సమయంలో ఇండియా 118 ఓవర్లు ఆడిన ఎటువంటి ఫలితం లేదు.ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఒక టీం 25 ఓవర్లు ఆడాకా, మరొక టీం 25 ఓవర్లు ఆడితే ఎటువంటి నష్టాలు జరగవని, పైగా మ్యాచ్ 15 ఓవర్ల నుండి 40 ఓవర్ ల వరకు కాస్త బోర్ కొడుతుందని ఇలా చేస్తే కనుక మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube