ఓ దొంగ మనదగ్గరకి వచ్చి కత్తి చూపించి నీ దగ్గర ఉన్న సొమ్ము ఇవ్వమని అడిగితే మనం ఏమి చేస్తాం ప్రాణభయంతో వెంటనే మనదగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తాం.ఇంగ్లాడ్ లో ఉంటున్న ఓ భారతీయుడికి ఇలాంటి ఘటనే ఎదురయ్యింది.
ఓ వ్యక్తి వచ్చి కత్తి చూపి డబ్బులు అడిగినందుకు సదరు భారతీయుడు చేసిన పనికి ఆ దొంగ పరుగో పరుగు పెట్టాడు.దాంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
వివరాలలోకి వెళ్తే.
ఇంగ్లాండ్ లో సూపర్ మార్కెట్ నడుపుతున్న భారతీయ సిక్కు వ్యక్తి దామన్ ప్రీత్ సింగ్ అరోరా కౌంటర్ లో కూర్చుని సెల్ ఫోన్ చూస్తున్నాడు.ఈ క్రమంలోనే షాపులోకి ఓ వ్యక్తి ముసుగులో వచ్చాడు.ఆమాట ఈ మాట చెప్తూ తానూ కప్పుకున్న ముసుగు కోటు నుంచీ కత్తి తీశాడు.
డబ్బులు ఇస్తావా చంపెయనా అని బెదిరించడంతో అరోరా ఒక్క నిమిషం ఆలోచించాడు.తన బుర్రకి పదును పెట్టాడు.
అతడు అడిగిన డబ్బు ఇస్తున్నట్టుగా నటిస్తూనే పక్కనే ఉన్న బ్యాట్ తీసుకుని దొంగ వైపుకి పరుగులు పెట్టాడు.కత్తికంటే బ్యాట్ పెద్దగా ఉండటంతో సదరు దొంగ బ్రతికు జీవుడా అంటూ పరుగులు పెట్టాడు.
ఈ తతంగం అంతా ఆ షాపు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అది తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.అది కాస్తా వైరల్ అవడంతో పాటు అతడి ధైర్య సాహసాలకి అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు.