దక్షిణాఫ్రికాలో 53 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు.దేశంలో కోవిడ్ 19 లాక్‌డౌన్ సమయంలో పీపీఈ కిట్ల కుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు తెలియజేసినందుకు గాను ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
గౌటెంగ్ ప్రావిన్షియల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌లో సీనియర్ ఆఫీసర్‌గా వున్న భారత సంతతికి చెందిన బబితా డియోకరన్ మంగళవారం తన బిడ్డను స్కూల్ దగ్గర దించారు.అనంతరం జోహెన్నెస్‌బర్గ్ శివారులో వున్న తన ఇంటికి వెళ్తుండగా ఆమెపై గుర్తుతెలియని దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే బబిత చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.ఆమె హత్య కేసుపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల సరఫరాలో 330 మిలియన్ల రాండ్స్ (అమెరికా కరెన్సీలో 20 మిలియన్ డాలర్లు) కుంభకోణం జరిగినట్లుగా ఆమె ప్రభుత్వానికి కీలక సమాచారం అందించడం వల్ల బబిత హత్యకు గురయ్యారని భావిస్తున్నారు.
సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (ఎస్ఐయూ) ప్రతినిధి కైజర్ మాట్లాడుతూ.
ఆరోగ్య శాఖలో అవినీతిపై తాము జరిపిన దర్యాప్తుకు సంబంధించి డియోకరన్ కీలక సాక్షి అని ఆయన చెప్పారు.ఈ కుంభకోణంపై విచారణ చివరి దశకు చేరుకుందని కైజర్ పేర్కొన్నారు.
ఈ దశలో బబిత హత్యకు గురికావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.న్యాయ విచారణ సమయంలో తన ప్రాణాలకు ముప్పు వుందని .మృతురాలు ఎన్నడూ తమ దృష్టికి తీసుకురాలేదని కైజర్ తెలిపారు.

గౌటెంగ్ ప్రీమియర్ డేవిడ్ మఖురా మాట్లాడుతూ.నేరస్తులను పట్టుకునేందుకు గాను ప్రావిన్షియల్ పోలీస్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ కార్యాలయానికి.
పీపీఈ కిట్ల కుంభకోణంపై వివరాలు తెలిపినందుకే బబిత హత్య చేయబడ్డారనే అనుమానాన్ని ఆయన కూడా వ్యక్తం చేశారు.