భారత సంతతికి చెందిన మాజీ మంత్రి థర్మన్ షణ్ముగరత్నం ( Tharman Shanmugaratnam )సింగపూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను షణ్ముగరత్నం గత నెలలో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.
సింగపూర్ ( Singapore )సంస్కృతిని మరింత విస్తరిస్తానని చెప్పారు.ఒకరితో ఒకరు కలిసి పనిచేసే విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు షణ్ముగరత్నం అభిప్రాయపడ్డారు.
కొత్త యుగానికి అధ్యక్షుడిగా వుండాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
తన సతీమణి జేన్ యుమికో ఇట్టోగితో( Jane Yumiko Ittogi ) కలిసి మాట్లాడిన షణ్ముగరత్నం .జాతీయంగా, అంతర్జాతీయంగా సింగపూర్ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే తన అనుభవాన్ని ఉపయోగించి దేశాన్ని సురక్షితంగా వుంచుతానని షణ్ముగరత్నం హామీ ఇచ్చారు.
రాజకీయాలు, ప్రజాసేవలో 22 ఏళ్లు పనిచేసినందున అనుభవం లభించిందని ఆయన చెప్పారు.తాను ఊసరవెల్లిలా రంగులను మార్చుకోవాల్సిన అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా.థర్మన్ షణ్ముగరత్నం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గత నెల ప్రారంభంలో ప్రకటించి అందరికీ షాకిచ్చారు.1960ల నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీ( People’s Action Party ) (పీఏపీ)కి తాను రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో వున్న అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు తన నిర్ణయాన్ని సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్‌కు( Lee Hsien Loong ) తెలియజేశారు.
మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (మాస్), జీఐసీ డిప్యూటీ ఛైర్మన్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్, మంత్రి తదితర హోదాల్లో షణ్ముగం పనిచేస్తున్నారు.

ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన థర్మన్ షణ్ముగం.గతంలో సెంట్రల్ బ్యాంక్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌లలో పనిచేశారు.తొలిసారిగా 2001లో జురాంగ్ జీఆర్‌సీ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
సింగపూర్‌లో చైనీస్ సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఏరియాల్లో ఈ ప్రాంతం కూడా ఒకటి.దేశ ఉప ప్రధానిగా, ఆర్ధిక, విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన థర్మన్.2019 మే నుంచి సీనియర్ మంత్రిగా పదోన్నతి పొందారు.అలాగే సోషియల్ పాలసీలకు కో ఆర్టినేషన్ మినిస్టర్‌గా, ఆర్ధిక విధానాలపై ప్రధానికి సలహాదారుగా కూడా వ్యవహరించారు.
సింగపూర్ ప్రజల కోరిక మేరకు తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షణ్ముగం తెలిపారు.తన జీవితంలో ఇది అత్యంత కఠినమైన నిర్ణయమన్న ఆయన.ఈ విషయంపై తన కుటుంబాన్ని , సన్నిహితులను సంప్రదించానని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షురాలిగా వున్న హాలీమా యాకూబ్ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 13తో ముగియనుంది.