సింగపూర్‌లో భారత సంతతికి చెందిన ప్రభుత్వ అధికారికి అక్కడి కోర్ట్ జైలు శిక్ష విధించింది.పబ్లిక్ హౌసింగ్ అథారిటీలో తనిఖీ అధికారిగా పనిచేస్తున్న సదరు అధికారి.
ఫ్లాట్‌లు, నివాస సముదాయాలలో పరిమితికి మించి ఎవరైనా నివసిస్తున్నారా అన్న దానిపై తనిఖీ చేయాల్సి వుంటుంది.ఈ క్రమంలో తాను తనిఖీకి వస్తున్నానని.
జాగ్రత్తగా వుండాలంటూ తన ఫ్లాట్‌లో నివసిస్తున్న భారతీయ అద్దెదారుడికి ముందే సమాచారం ఇచ్చాడు.ఈ నేరం బయటపడటంతో ఆయనకు కోర్ట్ సోమవారం 25 రోజుల జైలుశిక్ష విధించింది.
గతేడాది వెలుగుచూసిన ఈ నేరానికి సంబంధించి భారత సంతతికి చెందిన అధికారి కలయరసన్ కరుప్పయ్య (55)ను గతేడాది జనవరి 25 నుంచి హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ (హెచ్‌డీబీ) విధుల నుంచి అధికారులు సస్పెండ్ చేశారు.సదరు అధికారి.
తన ఇంట్లో నివసిస్తున్న భారత్‌కు చెందిన దమన్‌దీప్ సింగ్‌కు తాను తనికీకి రాబోతున్న సమాచారాన్ని ముందే తెలియజేశాడు.ఇది అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని అభియోగం మోపారు.
కరుప్పయ్య 2019లో అనేక సందర్భాల్లో హెచ్‌డీబీ తనిఖీల గురించి దమన్‌దీప్ సింగ్‌కు ముందే చెప్పినట్లుగా ఆరోపణలు వున్నాయి.ఈ కేసుకు సంబంధించి గతేడాది జనవరి 9న సింగపూర్‌లోని కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీబీబీ)కి ఫిర్యాదు అందింది.
దమన్‌దీప్ సింగ్ రిజిస్టర్డ్ అద్దెదారుగా వున్న ఫ్లాట్‌లో పరిమితికి మించి నివసిస్తున్న హెచ్‌డీబీకి ఫిర్యాదు అందింది.2019 ఆగస్టు 24, సెప్టెంబర్ 4న విడివిడిగా జరిపిన రెండు తనిఖీల్లోనూ ఈ ఫ్లాట్ కిక్కిరిసి వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ప్రతి సందర్భంలోనూ వరుసగా 19 మంది, 18 మంది ఆ ఫ్లాట్‌లో ఆశ్రయం పొందుతున్నట్లుగా వుంది.ఇక్కడి నిబంధనల ప్రకారం ఒక ఫ్లాట్‌లో కేవలం ఆరుగురికి మాత్రమే అనుమతి వుంది.