ప్రపంచవ్యాప్తంగా కీలక సంస్థలకు భారతీయులు సారథులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మానవాళి ఆరోగ్యాన్ని సంరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఫౌండేషన్‌గా సీఈవోగా భారత సంతతికి చెందిన అనిల్ సోని నియమితులయ్యారు.
జనవరి 1న డబ్ల్యూహెచ్ఓ ఫౌండేషన్ తొలి సీఈవోగా సోని బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో అనిల్ గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ వట్రియాస్‌లో గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి హెడ్‌గా కొనసాగారు.
అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో వైద్యారోగ్య సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు లాభాపేక్ష లేని రంగాల్లో 20 ఏళ్ల పాటు సేవలందించారు.కాగా, 2023లోగా బిలియన్ డాలర్ల నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకుని ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఫౌండేషన్ పేర్కొంది.
ఆ ఫౌండేషన్‌ను ఈ ఏడాది మేలో జెనీవాలో ప్రారంభించారు.ప్రపంచ ఆరోగ్య సమాజంతో కలిసి అత్యంత ఒత్తిడితో కూడిన ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ప్రారంభించారు.ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని హెచ్చరిస్తూ ప్రపంచస్థాయిలో వివిధ దేశాల ఆరోగ్య పరిస్థితులను, పరిణామాలపై అప్రమత్తం చేస్తుంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

1948, ఏప్రిల్ ఏడో తేదీన డబ్ల్యూహెచ్ఓను స్థాపించారు.ఐక్యరాజ్యసమితి సహకారంతో నడుస్తున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో వుంది.ఈ సంస్థకు సంబంధించిన నిధులన్నీ దీనిలో సభ్యత్వం ఉన్న దేశాలన్నీ సమకూర్చుతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో 26 దేశాల ఆమోదంతో ‘మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ 1948, ఏప్రిల్ ఏడున పాటించారు.అంతర్జాతీయ సమన్వయంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సార్స్, మలేరియా, ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమైన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తోంది.1979లో మశూచి వ్యాధిని సమూలంగా నివారించినట్లు ఈ సంస్థ పేర్కొంది.