లండన్‌కు చెందిన భారత సంతతికి చెందిన వ్యాపార సోదరులు సుఖీందర్ సింగ్, రాజ్‌బీర్ సింగ్‌లు తమ రిటైల్ స్పిరిట్స్ బిజినెస్‌ను ఫ్రెంచ్ పానీయాల దిగ్గజం పెర్నోడ్ రికార్డ్‌కు విక్రయించడానికి అంగీకారం తెలిపారు.1999లో సుఖీందర్ సింగ్ సోదరులు స్థాపించిన విస్కీ ఎక్స్చేంజ్ యూకేలోని అతిపెద్ద ఆన్‌లైన్ స్పిరిట్స్ రిటైలర్‌లలో ఒకటి.విస్కీలు, నాణ్యతతో కూడిన స్పిరిట్‌లను తయారు చేయడంలో పేరెన్నికగన్నది.ఈ సంస్థ దాదాపు 10000 ఉత్పత్తులను కస్టమర్లకు అందజేస్తుంది.వీరి కుటుంబానికి లండన్ నడిబొడ్డు కోవెంట్ గార్డెన్, గ్రేట్ పోర్ట్‌లాండ్ స్ట్రీట్, లండన్ బ్రిడ్జి వద్ద మూడు దుకాణాలు వున్నాయి.
పెర్నోడ్ రికార్డ్‌కు తమ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు సుఖీందర్ బ్రదర్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దాదాపు 20 సంవత్సరాల తమ కంపెనీ ప్రస్థానంలో పెర్నోడ్‌తో కలిసి తమ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నందుకు సంతోషంగా వుందన్నారు. విస్కీ ఎక్స్ఛేంజ్ కస్టమర్లను ఎల్లప్పుడూ ఒక కుటుంబంగా భావిస్తుందని చెప్పారు.
తమ విలువలను పంచుకునే భాగస్వామితో వ్యాపారాన్ని నిర్వహించడానికి తాము ఎదురుచూస్తున్నామన్నారు.ప్రపంచవ్యాప్తంగా వున్న అత్యుత్తమ తయారీదారుల నుంచి నాణ్యమైన విస్కీ, స్పిరిట్‌లను అందిస్తూనే వుంటామని సుఖీందర్ బ్రదర్స్ తెలిపారు.

అయితే కంపెనీని పెర్నోడ్ రికార్డ్‌కు విక్రయించినప్పటికీ విస్కీ ఎక్స్ఛేంజ్ తన ప్రస్తుత ఉద్యోగులతోనే పనిచేస్తుంది.సుఖీందర్ (53), రాబ్‌బీర్ (49)లు జాయింట్ డైరెక్టర్లుగా వ్యాపారాన్ని కొనసాగిస్తారు.తల్లిదండ్రుల నుంచి అందుకున్న వీరి వ్యాపారం పశ్చిమ లండన్‌లో వృద్ధి చెందింది.ప్రస్తుతం 3,000 రకాల సింగిల్ మాల్ట్ విస్కీలు, 400 రకాల షాంపైన్స్, 800 రకాల కాగ్నాక్స్, అర్మాగ్నాక్స్, 700 రకాల రమ్స్, 300 రకాల అపెరిటిఫ్‌లను ఈ సోదరులు అందిస్తున్నారు.