వీసా గడువు ముగిసినా ఇంకా తమ దేశంలోనే నివసిస్తున్న ఏడుగురు భారతీయులను శ్రీలంక ఇమ్మిగ్రేషన్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.గత వారం ఇమ్మిగ్రేషన్ అధికారులు వాట్లాలోని ఓ నిర్మాణ ప్రాంతంలో జరిపిన దాడుల సందర్భంగా ఈ ఏడుగురు భారతీయులు పట్టుబడ్డట్లు డైలీ మిర్రర్ ఒక కథనంలో పేర్కొంది.
ఇమ్మిగ్రేష్ వర్గాల సమాచారం ప్రకారం.భారతీయ పౌరులు 30 రోజుల బిజినెస్ వీసాపై శ్రీలంకకు చేరుకున్నారు.వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా శ్రీలంకను విడిచి వెళ్లకుండా ఇక్కడే వుండిపోయినట్లు అధికారులు వెల్లడించారు.కస్టడీలోకి తీసుకున్న అనంతరం ఏడుగురు భారతీయులను మిరిహానాకు తరలించి, వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారు దక్షిణ భారతదేశానికి చెందిన వారేనని, వీరంతా ఆన్‌లైన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.