మనలో చాలామంది సివిల్ సర్వీసెస్ పరీక్ష అత్యంత కష్టమైన పరీక్ష అని భావిస్తారు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలంటే ఎంతో కష్టపడాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఆ పరీక్షకు మించిన కష్టమైన పరీక్షలో సక్సెస్ సాధించి అభిషేక్ రెడ్డి ( Abhishek Reddy )వార్తల్లో నిలిచారు.దేశం కోసం పని చేసే అవకాశం చాలా తక్కువమందికి మాత్రమే వస్తుందనే సంగతి తెలిసిందే.
దేశం కోసం పని చేయడంలో వచ్చే సంతృప్తి మరే ఉద్యోగంలో కలగదు.తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిషేక్ రెడ్డి లెఫ్టినెంట్ హోదా సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఈ హోదా సాధించడం గురించి అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం సేవ చేసే అవకాశం రావడం వరం అని ఇలాంటి మంచి ఛాన్స్ దక్కినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.కంబైడ్ డిపెన్స్ సర్వీస్ పరీక్షలో అభిషేక్ రెడ్డి రెండో ర్యాంక్ సాధించారు.

తొలి ప్రయత్నంలోనే అభిషేక్ రెడ్డి రెండో ర్యాంక్ సాధించడంతో అతని కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.11 నెలల పాటు కఠోర సైనిక శిక్షణ పొందిన అభిషేక్ రెడ్డి సెప్టెంబర్ నెల 9వ తేదీన లెఫ్టినెంట్ అధికారిగా( lieutenant officer ) బాధ్యతలు స్వీకరించారు.అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలానికి చెందిన అభిషేక్ రెడ్డి సక్సెస్ స్టోరీ స్పూర్తిగా నిలుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అభిషేక్ రెడ్డి 350 మంది సైనికులకు అధికారిగా తన తల్లీదండ్రుల చేత స్టార్స్ పెట్టించుకుని అధికారుల ముందు లెఫ్టెనెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.అభిషేక్ తండ్రి మిలిటరీలో నాన్ కమిషన్ ఆఫీసర్ ( Non Commissioned Officer )గా పని చేశారు.తన తల్లీదండ్రుల వల్లే తాను కెరీర్ పరంగా సక్సెస్ సాధించానని అభిషేక్ రెడ్డి చెబుతున్నారు.
అభిషేక్ రెడ్డి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.