వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు.ఎన్నో రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా అమెరికాలో భారత సంతతి వైద్యుడు కీలక పదవికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.106 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ (ఏసీపీ)కి అధ్యక్షుడిగా ఇండో అమెరికన్ వైద్య నిపుణుడు డాక్టర్ అబ్రహామ్ ఎంపికయ్యారు.2021-22 కాలానికి గాను అబ్రహామ్ బాధ్యతలు చేపడతారు.ఈ సంస్థ ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్స్ , సబ్ స్పెషలిస్ట్‌లు, మెడికల్ విద్యార్ధులకు ప్రాతినిథ్యం వహిస్తుంది.
అమెరికాలో అతిపెద్ద మెడికల్ స్పెషాలిటీ సంస్థ అయిన ఏసీపీకి అధ్యక్షుడిగా ఎంపికైన తొలి భారత సంతతి వైద్యుదు అబ్రహం కావడం విశేషం.ఈ సంస్థకు 145కు పైగా దేశాల్లో సభ్యులు వున్నారు.
ఇందులో 1,61,000 మంది అంతర్గత వైద్యులు, వైద్య విద్యార్థులు వున్నారు.
ఏసీపీ అధ్యక్షుడిగా డాక్టర్ అబ్రహం నియమితులవ్వడం పట్ల అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) హర్షం వ్యక్తం చేసింది.
దాదాపు 1,70,000 మంది వైద్యుల సభ్యత్వంతో అమెరికన్ ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్స్ యొక్క అతిపెద్ద సంస్థగా వున్న ఏసీపీకి అధ్యక్షుడిగా జార్జ్ అబ్రహం ఎన్నిక కావడం మనందరికీ గర్వకారణమని ఏఏపీఐ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్కల ప్రశంసించారు.కేరళ రాష్ట్రానికి చెందిన డాక్టర్ నరేశ్ పారిఖ్, డాక్టర్ నరేంద్ర కుమార్‌తో పాటు పలువురు ఏఏపీఐ నేతలు ఆయనకు అభినందలు తెలియజేశారు.
డాక్టర్ అబ్రహం.భారత్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్ పట్టా పొందారు.జాన్స్ హాప్‌కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.అనంతరం ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ, చీఫ్ రెసిడెన్సీని వోర్సెస్టర్‌లోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో పూర్తి చేశారు.
ఆ తర్వాత జాన్స్ హాప్‌కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ఎపిడెమియాలజీలో ఎంపీహెచ్ పట్టా సంపాదించారు అబ్రహం.

ఇంతకుముందు డాక్టర్ అబ్రహం ఏసీపీకి సంబంధించి మసాచుసెట్స్ చాప్టర్ గవర్నర్ సహా అనేక హోదాలలో పనిచేశారు.ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌గా ఎన్నికయ్యారు.అలాగే మసాచుసెట్స్ మెడికల్ స్కూల్‌లో మెడిసిన్ ప్రొఫెసర్‌గా, సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో మెడిసిన్ ఎమెరిటస్ ప్రెసిడెంట్‌గా, మసాచుసెట్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మెడిసిన్ అనుబంధ ప్రొఫెసర్‌గాను విధులు నిర్వహించారు.