ఎలాంటి వ్యాధికైనా చికిత్స చేయాలంటే ముందు దానిని గుర్తించాలి.మానవాళికి సవాల్ విసిరిన మహమ్మారులన్నింటిని గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్లే అవి కోట్లాది మందిని బలి తీసుకున్నాయి.
వైద్య రంగం అభివృద్ధి చెందడం, ఎంతోమంది మహనీయుల నిర్విరామ కృషి ఫలితంగా టెస్టింగ్, డయాగ్నోసిస్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.చిన్న పరీక్ష చేసి ఏ వ్యాధి సోకిందో, ఏ భాగంలో వుందో, ప్రస్తుతం దాని కదలిక ఏంటి అన్న దానిని తెలుసుకుని.
అందుకు తగిన విధంగా చికిత్స చేస్తున్నారు వైద్యులు.
ఇక మనలో చాలా మందికి ఎంఆర్ఐ స్కానింగ్ గురించి తెలుసు.
తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు శరీరంలోని ఏ భాగంలో ఇబ్బంది వుందో ఆ భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇచ్చే యంత్రమే ఎంఆర్ఐ.దీనినే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లేదా MRI అని పిలుస్తారు.
బలమైన అయస్కాంత క్షేత్రం, రేడియో తరంగాలను ఉపయోగించి రోగి శరీరాన్ని ఛాయాచిత్రాలుగా తీస్తారు.దీని ద్వారా ఛాతీ, ఉదరం, మెదడు, గుండె, వెన్నెముక, రక్తనాళాలు, ఎముకలకు సంబంధించిన అనారోగ్య పరిస్థితులను నిర్ధారించవచ్చు.ఈ స్కాన్ తీయడానికి డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో రూ.4,000 నుంచి రూ.25 వేల వరకు రుసుము వసూలు చేస్తారు.
ఇలాంటి ఎంఆర్ఐ మెషిన్‌కు సంబంధించి ఇండో అమెరికన్ శాస్త్రవేత్త అరుదైన ఆవిష్కరణ చేశారు.
ఇప్పటి వరకు గాలి కూడా చొరబడని గదుల్లో వుండే.ఈ మెషిన్‌ను ఎక్కడికైనా సరే సులభంగా తరలించేలా రూపొందించారు.
అదే ‘‘పొర్టబుల్ ఎంఆర్ఐ మెషిన్ ’’.భారత సంతతికి చెందిన కెవిన్ సేథ్.యేల్ యూనివర్సిటీలోని తన సహచర పరిశోధకుల బృందం ఈ అరుదైన ఆవిష్కరణ చేసింది.దీని ద్వారా క్లిష్టమైన వైద్య లక్షణాలను గుర్తించవచ్చు.ముఖ్యంగా స్ట్రోక్ రోగులలో, ప్రాణాలను నిలబెట్టే సమాచారాన్ని ఇది అందిస్తుంది.

ప్రాణాంతకమైన బ్రెయిన్ ఇమేజింగ్ స్కాన్‌లకు సంబంధించి ఎంఆర్ఐ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ పోర్టబుల్ ఎంఆర్ఐ మెషిన్ రోగుల ప్రాణాలను నిలబెడుతుందని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ ప్రొఫెసర్ కెవిన్ సేథ్ మీడియాకు తెలిపారు.ఈ పరికరాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని గ్రామీణ ఆసుపత్రుల్లో అమర్చడం వల్ల ప్రాణాలను నిలబెట్టవచ్చని ఆయన వెల్లడించారు.

పరిశోధనలో భాగంగా యేల్ శాస్త్రవేత్తల బృందం ‘‘పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ ఎంఆర్ఐ సిస్టమ్’’ అని పిలవబడే పరికరం సామర్ధ్యాన్ని పరిశీలించింది.దీనిని ఎక్కడ కావాలంటే అక్కడ అమర్చి.ఫలితాలను రాబట్టారు.
పరిశోధనకు సంబంధించిన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో ఆగస్టు 25న ప్రచురించారు.ఈ పోర్టబుల్ ఎంఆర్ఐ మెషిన్‌ను కనీస శిక్షణతో మెడికల్ టెక్నీషియన్లు ఎక్కడైనా ఉపయోగించవచ్చని పరిశోధకులు చెప్పారు.
ఈ మెషిన్‌ను కెనెక్టికట్‌కు చెందిన మెడికల్ టెక్నాలజీ ఇంక్యూబేటర్ 4కాటలైజర్‌కు చెందిన హైపర్‌ఫైన్ రీసెర్చ్ సంస్థ అభివృద్ధి చేసింది.కాగా, డాక్టర్ కెవిన్ సేథ్.2013 నుంచి యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో న్యూరోక్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ చీఫ్‌గా, న్యూరాలజీ విభాగానికి క్లినికల్ రీసెర్చ్ చీఫ్‌గానూ పనిచేశారు.