ఆంధ్రుల అభిమాన నగరంలో... సెలబ్రిటీ డిజైనర్‌ శశి వంగపల్లి ముగ్ధ స్టోర్‌ అక్టోబర్ 8న విజయవాడలో ప్రారంభం...

ప్రతి అందానికి ప్రతి బంధానికి ముగ్ధ.ఇప్పుడు మీ విజయవాడలో ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను విజయవాడ నగర వాసులకు అతి త్వరలో దగ్గర కానున్నారు.

 In Andhra's Favorite City Celebrity Designer Shashi Vangapally's Mugdha Store Op-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి.ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ మరియు వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

ఈ సందర్భంగా శశి వంగపల్లి మాట్లాడుతూ ‘‘ విజయవాడ నా అభిమాన నగరాల్లో ఒకటి.మాకు ఇక్కడ చాలా మంది సన్నిహుతులు ముఖ్యంగా ఏళ్లతరబడి క్లయింట్స్‌ ఉన్నారు.

ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతమైన వివాహ వేడుకల్లో మేం భాగం పంచుకున్నాం.అంతేకాదు ఇక్కడ నుంచీ హైదరాబాద్‌లోని మా స్టోర్స్‌కు ప్రతీ రోజూ ఎందరో క్లయింట్స్‌ వస్తుంటారు.

ఈ అందమైన నగరంలో భాగం కావడమనేది మా కల.ఎందుకంటే ఇది మా అమ్మగారు పుట్టిన ఊరు.అందువల్ల కూడా ఈ నగరంలో స్టోర్‌ ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.ఆ కల ఇప్పటికి సాకారమైంది’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌ అనేది శశివంగపల్లి ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం.అన్ని విషయాల్లోనూ దేశంలోనే అత్యంత వినూత్నమైన స్టోర్‌ ఇది.కస్టమర్లకు ఆహ్లాదకరమైన షాపింగ్‌ అనుభూతిని అందించే ఈ స్టోర్‌ ఇప్పుడు విజయవాడ నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.అక్టోబరు 8, 2021న ప్రారంభించనున్నారు.

‘‘మా దగ్గర ప్రత్యేకమైన, ఉత్తమమైన కలెక్షన్స్‌ మాత్రమే కాదు ధరలు కూడా అందుబాటులోనే అందిస్తాం.ఎల్లప్పుడూ మేం నాణ్యతపైనే దృష్టి సారిస్తాం.

డిజైన్లు, దుస్తుల నాణ్యత రెండింటి పరంగానూ మా కస్టమర్లకు ఉత్తమమైనవే అందివ్వాలని ఆశిస్తాం’’అని స్టోర్‌ నిర్వాహకులు తెలిపారు.ఈ స్టోర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్యాషన్‌ ప్రియులు, మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube