అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న తరుణంలో అగ్ర రాజ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఇప్పటికే ట్రంప్ చుట్టూ అభిశంసన ఉచ్చి బిగించి ఉంచిన డెమోక్రటిక్ పార్టీ ఎలాగైనా సరే సెనేట్ లో అభిశంసన నెగ్గేలా పావులు కదుపుతోంది.
మరో పక్క అమెరికా మాజీ బద్రతా సలహాదారుడు జాన్ సైతం ట్రంప్ దోషి అంటూ ఏకంగా పుస్తకాన్ని విడుదల చేస్తున్న తరుణంలో ట్రంప్ ఆ ప్రయత్నాలని వైట్ హౌస్ ప్రతినిధుల ద్వారా నిలుపుదల చేశారు.దాంతో తనకి అడ్డుగా ఉన్నవాటిని ఒక్కొక్కటిగా తొలగింసుకుంటున్న ట్రంప్ కి తాజాగా ఓ వార్త షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
ప్రస్తుతం సెనేట్ లో అభిశంసన విచారణ ఎదుర్కుంటున్న ట్రంప్ కి రిపబ్లికన్ ల మద్దతు ఉండదు అనే ఊహాగానాలు ట్రంప్ కి నిద్రపట్టకుండా చేస్తున్నాయి.ఇప్పటికే ఈ వార్త అమెరికా వ్యాప్తంగా హల్చల్ చేస్తుండటంతో 5 వ తేదీన జరగాల్సిన అభిశంసన తుది ప్రక్రియపై సర్వత్రా ఉత్ఖంట నెలకొంది.
ఇప్పటికే పలు టీవీ చర్చా కార్యక్రమాలలో ట్రంప్ కి ఎలాగో డెమోక్రాట్లు మద్దతు ఇవ్వరు, మరి తన సొంత పార్టీ రిపబ్లికన్లు అయిన మద్దతుని ఇస్తారా అనే ప్రశ్నలకి డెమోక్రాట్లు మద్దతు ఇవ్వరనే కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.అందుకు కారణం లేకపోలేదు.
ఇరాన్ పై యుద్ధం చేయాలనే ఆలోచన ట్రంప్ కి వచ్చిన సమయంలో డెమోక్రటిక్ పార్టీ యుద్దానికి ఆదేశించే అధికారాలని లాగేయాలని సెనేట్ లో బిల్లు పాస్ చేసింది.ఈ క్రమంలోనే రిపబ్లికన్లు ట్రంప్ కి వ్యతిరేకంగా ఓట్లు కూడా వేశారు.
దాంతో ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని ట్రంప్ తెగ హైరానా పడుతున్నాడట.మరి ట్రంప్ అభిశంసన నేగ్గేనా, లేదా తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.