సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు మంచి ముహూర్తం,తిథి చూసుకొని కొనుగోలు చేస్తాం.అలాగే శుభముహూర్తాన కారు బయటకు తీసుకొచ్చి దిష్టి తగలకుండా గుమ్మడి కాయ కొట్టి అనంతరం వినాయకుడి ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేయించడం చేస్తుంటాము.
ఇలా మన వాహనాలకు ప్రమాదం జరగకుండా ఉండటం కోసం మన వాహనంలో వివిధ రకాల ఇష్టదైవాలను పెట్టుకొని ఉంటాము.
అయితే వాస్తు ప్రకారం వాహనంలో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవు.
మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే.
మనం ప్రయాణిస్తున్న వాహనాలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలంటే వాహనంలోని సీట్ల కింద ఒక పేపరులో రాళ్ల ఉప్పు, వంటసోడా పెట్టాలి.
తరచూ వీటిని మారుస్తూ ఉంచడం వల్ల వాహనంలో పాజిటీవ్ ఎనర్జీ ఏర్పడి ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటుంది.అదేవిధంగా వాహనంలో సహజ సిద్ధంగా లభించే రాయి లేదా స్పటికాన్ని ఉంచడం ఎంతో మంచిది.
ఇవి ఎల్లప్పుడు వాహనాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా వాహనానికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుతుంది.
అలాగే మనం ఏదైనా వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా నీటితో నింపిన వాటర్ బాటిల్ ఉండాలి.
ఈ వాటర్ బాటిల్ మన మనసును ఉత్తేజపరుస్తుంది కనుక ఎలాంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు.అలాగే చాలామంది డాష్ బోర్డ్ పై ఎవరికి నచ్చిన వారి ఇష్టదైవాలను పెట్టుకోవడం మనం చూస్తుంటాము.
అయితే ఎక్కువగా వినాయకుడిని పెట్టుకోవడం వల్ల మనకు మార్గమధ్యంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడు కాపాడతారని చెబుతారు.ఇలా వాహనంలో ఈ విధమైనటువంటి వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారిపై కూడా సానుకూల ప్రభావం పడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతాయి.