భారత్ నుంచీ ఉన్నత చదువుల కోసం, వ్యాపారాలు, ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన ఎన్నారైలు ఎంతో మంది ఆయా దేశాలలో స్థిరపడి ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారు.ఆర్ధికంగా నిలదొక్కుకున్న ఎన్నారైలు భారత్ లో తాము పుట్టిన ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
అలాగే భూములు కొనుగోలు చేయడం, అమ్మడం వంటి లావాదేవీలు కూడా జరుపుతున్నారు.అయితే స్థిరాస్తులు కొనుగులు లేదా అమ్మడం పై RBI కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నారైలు భారత్ లో భూములు కొనాలన్నా, అమ్మాలన్నా ఇలాంటి అంశాలన్నీ ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్జ్, అలాగే RBI ఆధీనంలో జరుగుతాయి.ఎన్నారైలు అయినా, లేక ఓసిఐ లు అయినా సరే ఫెమా చట్టం ప్రకారం ఎన్నారైలు అయినా, ఓసిఐ లు అయినా భారతీయులుగానే పరిగణించబడుతారు.
దాంతో ఈ రెండు వర్గాల వారు ఆస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంపై RBI కొత్త నిభందనలు పెట్టింది.అవేంటంటే.
ఎన్నారైలు, ఓసిఐ లు స్థిరాస్తులు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు వారికి వీటిపై ఎలాంటి పరిమితి నిభందన లేదు వారు వీటిపై హోమ్ లోన్స్ కుడా తీసుకోవచ్చు అయితే పంట పొలాలు లేదా ఫాం హౌస్ లు కొనుగోలు మాత్రం చేయడానికి మాత్రం అనుమతి లేదని తేల్చేసింది.అంతేకాదు స్థలాలు కొనే సమయంలో కొన్ని నిభందనలు తీసుకువచ్చింది.
దాని ప్రకారం కొనుగోళ్ళు లేదా అమ్మకాలు చేసే సమయంలో ఎన్నారైలు బ్యాంకులు లేదా NRO లేదా FCNR ఖాతాల ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది.ఫారెన్ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయాలనుకునే వారు ఎవరైనా సరే వాటిని అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.