చిన్న తరహా కుటీర పరిశ్రమలలో పుట్టగొడుగుల పెంపకం( Mushrooms Cultivation ) వల్ల మంచి ఆదాయం పొందవచ్చు.ఎందుకంటే పుట్టగొడుగుల్లో పోషక విలువలు చాలా ఎక్కువ.
పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మార్కెట్లో పుట్టగొడుగులకు ఎప్పుడు డిమాండే.కొంతమంది నిరుద్యోగ యువత పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో పుట్టగొడుగుల పెంపకం చేసి ఏడాది పొడవునా మంచి ఆదాయం పొందవచ్చు.పుట్టగొడుగులలో చాలా రకాలే ఉన్నాయి.
కానీ రైతులు నాలుగు, ఐదు రకాల మాత్రమే పెంచుతున్నారు.వీటిలో వరిగడ్డి పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు ముఖ్యమైనవి.
వీటిలో పాల పుట్టగొడుగుల( Milky Mushroom Cultivation )కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

పుట్టగొడుగుల పెంపకం చేసే ప్రదేశంలో 10/10 చదరపు అడుగుల గది విస్తీర్ణంలో 250 నుంచి 300 బెడ్లు పెంచుకోవచ్చు.బెడ్ల అమెరికాకు తగిన స్టాండ్లు ఏర్పాటు చేసుకోవాలి.పాల పుట్టగొడుగుల బెడ్లను మొదటి 20 రోజులు చీకటి గదిలో పెంచాలి.
అంటే ప్రతి రెండు వెలుతురు గదులకు ఒక చీకటి గది ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం పొడుగునా దిగుబడి( High yield ) తీయవచ్చు.

ఇక చీకటి గదిలో తగిన తేమశాతం, ఉష్ణోగ్రత ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.బెడ్లలో మైసీలియం అభివృద్ధి చెందిన తర్వాత పెద్ద బెడ్లు అయితే మధ్యకు కోసి మట్టితో కేసింగ్ చేయాలి.కేసింగ్ పూర్తయిన తర్వాత పాల పుట్టగొడుగులను వెలుతురు గదిలో ఉంచాలి.
పుట్టగొడుగులు పెంచే గదిని ఫార్మాల్డిహైడ్ కలిపిన నీటితో శుభ్రం చేస్తే గది క్రిమిరహితంగా ఉంటుంది.గదిలో ఉష్ణోగ్రత 30-35 డిగ్రీలు, గాలిలో తేమశాతం 80-90 ఉండాలి.
ఇక నీరు బెడ్లపై కారే విధంగా పిచికారి చేయకుండా, బెడ్లు తడి పొడిగా ఉండేటట్లు నీటిని పిచికారి చేయాలి.పాల పుట్టగొడుగులు 35 రోజుల తర్వాత దిగుబడి రావడం ప్రారంభమవుతుంది.
మూడు నుంచి నాలుగు దశలుగా పుట్టగొడుగులను బెడ్ల నుంచి మెలితిప్పి కోయాల్సి ఉంటుంది.ఒక కిలో పుట్టగొడుగుల విత్తనాలు ఆరు బెడ్లకు సరిపోతాయి.ఒక నెలకు కనీసం 100 బెడ్ల నుంచి పుట్టగొడుగులు తీస్తే, ఖర్చులన్నీ పోను రూ.10,000 కు పైగా నికర లాభం పొందవచ్చు.ఆదాయం మరింత పెరగాలంటే.బెడ్ల సంఖ్యను పెంచాలి.చిన్న చిన్న గదుల్లో సైతం పుట్టగొడుగుల పెంపకం చేయవచ్చు.పెట్టుబడి వ్యయం కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి మంచి ఆదాయం పొందవచ్చు.