జనసేన బలపడితే.. టీడీపీకే నష్టమా ?

ఏపీలో జనసేన( Janasena ) పార్టీ రోజు రోజుకు బలం పెంచుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరతీస్తోంది.గతంలో జనసేన పార్టీని లైట్ తీసుకున్న వైసీపీ, టీడీపీ పార్టీలే ఇప్పుడు జనసేన పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

 If Janasena Gets Stronger Tdp's Loss?janasena , Tdp, Ap Politics ,chandrababu N-TeluguStop.com

గతంలో పవన్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తాడని, రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి అని పవన్ పై విమర్శలు గుప్పించిన వాళ్ళే ఇప్పుడు పవన్ దూకుడు కు సైలెంట్ అయిపోయారు.ఇక టీడీపీ పాలన మరియు వైసీపీ పాలన చూసిన ఏపీ ప్రజలు ఈసారి పవన్ వైపు దృష్టి పెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాగా జనసేన ఎన్నికల నాటికి మరింత బలపడితే ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుందనే దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan, Ysrcp-Politics

అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే జనసేన ప్రభావం టీడీపీ( TDP ) పైనే అధికంగా ఉండే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం.గత ఎన్నికలను బట్టి చూస్తే వైసీపీ అన్నీ జిల్లాలో కూడా బలంగా ఉంది.తరువాతి స్థానంలో టీడీపీ ఉంది.

కానీ ఇప్పుడు జనసేన రేస్ లోకి రావడంతో వైసీపీ తరువాత జనసేన పార్టీనే అనే వాదన బలపడుతోంది.అంతేకాకుండా వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీనే ప్రధాన ప్రత్యర్థి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.

పదే పదే పవనే టార్గెట్ చేస్తూ చంద్రబాబును లైట్ తీసుకుంటున్నారు.కాగా టీడీపీ జనసేన పొత్తుకు సై అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదిరితే వైసీపీకి గట్టి దేబ్బే అనే సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan, Ysrcp-Politics

ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రెండు పార్టీలకు ప్లెస్ అవుతుంది.కానీ పొత్తు కుదరకపోతే టీడీపీనే అధికంగా నష్టపోయే అవకాశం ఉంది.అటు వైసీపీ వ్యతిరేక ఓటు అలాగే కొత్త ప్రభుత్వాన్ని కోరుకునే ఓటు బ్యాంకు రెండు కూడా జనసేన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది అలాగే స్పష్టమైన ఆధిక్యం కనబరచకపోతే వైసీపీకి( YSRCP ) లాభం కలిగి, టీడీపీకి భారీగా నష్టం చేకూరుస్తుంది.

కాబట్టి జనసేన పొత్తు టీడీపీకి చాలా అవసరం.అలా కాకుండా జనసేన సొంతంగా ఏమాత్రం బలం పెంచుకున్న టీడీపీపైనే అధిక ప్రభావం ఉంటుంది.అందుకే పవన్ తో కలిసినేదుకు చంద్రబాబు( Chandrababu Naidu ) చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.అటు పవన్ కూడా బాబుతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నప్పటికి స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు.

మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube