మొటిమలు ఈ పేరు వింటేనే యువతీ, యువకులు భయపడిపోతుంటారు.టీనేట్ రాగానే ప్రారంభం అయ్యే ఈ మొటిమలు.
ఎంతగా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా అమ్మాయిలు ముఖంపై మొటిమలు వస్తే చాలు తీవ్రంగా కృంగిపోతుంటారు.
ఇక వాటిని తగ్గించుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.ఫేస్ క్రీములు, లోషన్లు, ఫేస్ ప్యాకులు అబ్బో చాలానే చేస్తాయి.
అయితే న్యాచురల్‌గా కూడా మొటిమల సమస్యకు సలుభంగా చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా సముద్రపు ఉప్పు (సీ సాల్ట్) మొటిమలను నివారించడంతో అద్భుతంగా సహాయపడుతుంది.
సముద్రపు ఉప్పులో ఎన్నో పోషకాలు, ఖనిజాలు నిండి ఉంటాయి.అవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో గ్రేట్‌గా ఉపయోగపడుతాయి.
ముఖ్యంగా మొటిమల సమస్యతో బాధ పడే వారు ఒక బౌల్‌లో ఉముద్రపు ఉప్పు, వేడి నీరు, శెనగపిండి మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి పావు గంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి.
అలాగే ఒక బౌల్‌లో సముద్రపు ఉప్పు తీసుకుని అందులో పుట్టు తేనె మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషాలు పాటు వదిలేయాలి.ఆ తర్వాత కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే మొటిమలు తగ్గడంతో పాటుమొండి మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.
ఇక మొటిమలనే కాదు కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలోనూ సముద్రపు ఉపయోగపడుతుంది.ముందు ఒక బౌల్‌లో సముద్రపు ఉప్పు, వేడి నీరు పోసి బాగా కలిపాలి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి.కళ్ల చుట్టు అప్లై చేయాలి.
పావు గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే వలయాలు పూర్తిగా మటుమాయం అవుతాయి.