బీట్ రూట్ ను ఇలా తీసుకుంటే హెయిర్ ఫాల్ కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు!

చాలా మంది త‌మ జుట్టు విపరీతంగా రాలిపోతుందని ఎంతగానో మదన పడుతుంటారు.జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.

 If You Take Beetroot Like This, You Can Permanently Stop Hair Fall!, Beetroot, B-TeluguStop.com

అయినా సరే ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం అనేది ఆగదు.ఇలా రెగ్యులర్ గా జుట్టు ఊడిపోవడం వల్ల కురులు పల్చగా మారిపోతుంటాయి.

అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి బీట్ రూట్ ఉత్తమంగా సహాయపడుతుంది.ముఖ్యంగా బీట్ రూట్( Beetroot ) ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే హెయిర్ ఫాల్( Hair fall )కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని ఫీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే మూడు ఉసిరికాయలు( Gooseberry ) తీసుకుని గింజ తొల‌గించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్క‌లు, ఉసిరికాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి.

Telugu Beetroot, Beetroot Amla, Care, Care Tips, Fall-Telugu Health

అలాగే ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా ఒక గ్లాస్ చొప్పున సేవించాలి.

ఈ జ్యూస్ ను ప్రతి రోజు క‌నుక‌ తీసుకుంటే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.కుదుళ్ళు దృఢంగా మారుతాయి.హెయిర్ ఫాల్ అనేది క్రమంగా కంట్రోల్ అవుతుంది.

Telugu Beetroot, Beetroot Amla, Care, Care Tips, Fall-Telugu Health

అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కాబట్టి ఎవరైతే అధిక హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్నారో వారు తప్పకుండా బీట్ రూట్ పైన చెప్పిన విధంగా తీసుకునేందుకు ప్రయత్నించండి.కచ్చితంగా మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

పైగా ఈ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల చర్మం నిగారింపుగా మెరుస్తుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మం పై మొండి మచ్చలు ఉంటే దూరం అవుతాయి.రక్తహీనత సమస్య( Anaemia )ను నివారించడానికి కూడా ఈ బీట్ రూట్ జ్యూస్ ఉత్తమంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube