తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) రాజకీయంగా అంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదు.పార్టీలో చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నా, షర్మిల మాత్రం తాము తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెబుతున్న షర్మిల ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని( BRS ) టార్గెట్ చేసుకున్నారు.ఆ పార్టీ అధినేత కేసిఆర్ తో పాటు, కేటీఆర్ కవిత వంటి వారిపైన సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు.
దీంతో పాటు నిరంతరం ఏదో ఒక పోరాటంలో పాల్గొంటూనే తమ పార్టీ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) బీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ షర్మిల బహిరంగంగానే ప్రకటించుకున్నారు.
అయితే పొంగులేటి మాత్రం గత కొంతకాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో( Khammam ) రాజకీయంగా హడావుడి చేస్తున్నారు.ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాలలోను తన అనుచరులు పోటీకి దింపుతానని ప్రకటించుకున్నారు.ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేది క్లారిటీ లేనప్పటికీ,
బీఆర్ఎస్ తో తెగ తెంపులు చేసుకున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అయితే తాజాగా తాను జాతీయ పార్టీలో చేరబోతున్నట్లు పొంగులేటి ప్రకటించారు.దీంతో ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా పొంగులేటి ఇచ్చిన క్లారిటీతో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఆయన చేరే అవకాశం లేదని విషయం తేలిపోయింది.దీంతో పొంగులేటి తమ పార్టీలో చేరబోతున్నారని ప్రకటించుకున్న షర్మిలకు ఆయన ప్రకటన మింగుడు పడడం లేదు.
అయితే పొంగులేటి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ కుటుంబం చలవతోనే ఆయన ఆర్థికంగా నిలదొక్కుకున్నారనే చర్చ కూడా లేకపోలేదు.
ఆయన గతంలో వైసిపి నుంచి ఎంపీగా ఖమ్మం నుంచి గెలిచారు.ఇప్పటికీ జగన్ కు అత్యంత సన్నిహితుదిగా ఆయనకు పేరు ఉంది.ఇటీవల కాలంలో షర్మిలతో పాటు , వైఎస్ విజయలక్ష్మి తోను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండుసార్లు భేటీ అయ్యారు.దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి.
అయితే పొంగులేటి మాత్రం బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కొద్దికాలం క్రితం పొంగులేటి ఢిల్లీకి వెళ్లి బిజెపి కీలక నేతలను రహస్యంగా కలిశారు.
సరైన సమయం చూసుకొని బిజెపి కండువా కప్పుకునేందుకు ఆయన సిద్ధమవుతుండగా.షర్మిల మాత్రం ఇంకా పొంగులేటి తమ పార్టీలో చేరతారనే ఆశా భావంతో ఉన్నారు.